సరైనోడు .. శ్రీరస్తు శుభమస్తు .. ధ్రువ

as

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, పరుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కత్వంలో అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీరస్తు శుభ‌మ‌స్తు’.

రోజులు మారాయి .. ఒక హిరోకు అభిమానులు ఎంత అవసరమో, ఒక వర్గంపై మరో వర్గం ఆదిపత్యం కోసం, ఆయా వర్గాలకు హిరోల అవసరం కూడా అంతే. ఇష్టపడి అభిమానించడమే కాదు, ఒక హిరో ప్రత్యర్దిగా ఇంకో హిరోను అభిమానించడం ఎప్పటినుండో వుంది. మెగా అభిమానులు మెగా వారసుడిగా రామ్‌చరణ్ ను మోయ్యడం ఒకెత్తు అయితే, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో ట్రెండ్ మొదలయ్యింది. మేము మొయ్యలేం మాకొద్దు మొర్రో అని మెగా అభిమానులే డైరక్ట్‌గా అనే స్థాయిలో, చిరంజీవి కుటుంబం నుంచి హిరోలు వస్తునే వున్నారు. అందులో అల్లు శిరీష్ ఒకడు.

అల్లు ఫ్యామిలీ వారు, మెగా అభిమానుల డైరక్ట్ విమర్శలు తట్టుకొలేక, మెగా అభిమానులను రిఫరెన్స్ చెయ్యడం మానేసారు. మీ అభిమానంతో మాకు పని లేదు, మా ప్లానింగ్ & మా కష్టార్జితమే మాకు ముఖ్యం అంటున్నారు. మెగా అభిమానుల అండలేకుందానే మొన్న సరైనోడు హిట్ కొట్టారు. ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తు తో అభిమానులతో మాకు అవసరం లేదని మరోసారి నిరూపించబోతున్నారు. అల్లు ఫ్యామిలీ ప్లానింగ్ చేసినట్టుగానే, సినిమా హిట్ అయితే మెగా అభిమానుల రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.

అల్లు అరవింద్ తెలివైనోడు అని మరోసారి నిరూపిస్తూ, ఆ రెండు సినిమాలతో మెగావారసుడు “ధ్రువ”ను కూడా కలిపేసి, ఆ మూడు సినిమాలు హిట్ అనడం మిడియాను అకర్షించింది. యాంకర్ సుమ బాగా క్యాచ్ చేసింది.

httpv://youtu.be/xLssY0-O_MY

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in శ్రీరస్తు శుభమస్తు, Featured. Bookmark the permalink.