తెలుగుసినిమా రేంజ్ ఎంతో బాహుబలి చూపించింది. ఆ రేంజ్‌కు చేరుకొవాలంటే కేవలం సినిమాలో సత్తా వుంటే సరిపోదు. ఒక వ్యూహం ప్రకారం సినిమాపై హైప్ అవసరం. ఒక మంచి సినిమా లక్ష్యం భారీ కలక్షన్స్ అయితే, వీలైనంత హైప్ చాలా అవసరం. ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు వెచ్చించి ఎంతో కష్టపడి ఎంతో నమ్మకంతో చేసే సినిమాను హైప్ చెయ్యడానికి భయపడకూడదు. ఎంత హైప్ చేయగల్గితే అంత చేయగల్గాలి. అలా అని ప్రతి సినిమాను హైప్ చెయ్యలేరు. చేసినా హైప్ రాదు.
జనతా గ్యారేజ్ సినిమాను ఒక వ్యూహం ప్రకారం బాగానే హైప్ చేస్తున్నారు. హైప్ చెయ్యడంలో సక్సస్ అయినట్టే కనిపిస్తున్నారు. డైరక్టర్ శ్రీమంతుడు తర్వాత సినిమా కావడంతో పాటు, నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్.టి.ఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, వారు చేస్తున్న హైప్ ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. ఆ హైప్ మరింత పెరగాలంటే దేవిశ్రీ ప్రసాద్ రేపు రిలీజ్ అయ్యే ఆడియోలో ఒకటి రెండు ఇనిస్టేంట్ హిట్ సాంగ్స్ ఇవ్వల్సి వుంది. ట్రైలర్ ప్రేక్షకులు ఆశీంచే, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా వుంటే బీభత్సమైన ఓపినింగ్స్ రావడానికి అవకాశం వుంది. మోహన్ లాల్ ఒక ప్రధాన పాత్ర పోషించడంతో మళయాళంలో కూడా భారీ కలక్షన్స్ సాధించే అవకాశం వుంది. సినిమాకు మంచి టాక్ వస్తే, మేకర్స్ టార్గెట్ అయిన శ్రీమంతుడు కలక్షన్స్ ఈజీగా క్రాస్ చేస్తుంది. good luck NTR.
Funny post …
What is funny here that you think?.. Be clear
HARI, THANK U SO MUCH for your lovely wish to MY HERO.I h’ve been following u’r a2zdreams…since 6 yrs…. BUT TODAY I CAN’T STOP MYSELF TO COMMENT ON U’R PAGE….
THANK U SO MUCH….for the words good luck NTR…