కొట్టేసినట్టే…

JG

యంగ్ ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమా “జనతా గ్యారేజ్”. సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా లక్ష్యం “శ్రీమంతుడు” కలక్షన్స్ బ్రేక్ చెయ్యడం. సరైనోడు సినిమా మేకర్స్ “శ్రీమంతుడు” కలక్షన్స్ బ్రేక్ చేసే ప్రయత్నంచ్ చేసారు. ఆ సినిమా కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులతో మేజర్ ప్రేక్షక వర్గాన్ని ఆకట్టుకున్నా, ఆ సినిమాలో చంపడాలు మరీ ఎక్కువై ఒక వర్గం ప్రేక్షకులు భయపడటంతో శ్రీమంతుడిని రీచ్ కాలేకపోయింది.

“జనతా గ్యారేజ్” మంచి ఓపినింగ్స్ సాధించడానికి కావల్సిన హైప్ & స్టేజ్ సెట్ అయిపోయింది. పాటలు అదిరిపొయాయి. ట్రైలర్ బాగుంది. ఈ సినిమాలో మొక్కలు, మనుషులు అంటూ మంచిగా ఆకట్టుకునే అంశాన్ని రైటర్-దర్శకుడు కొరటాల శివ జోడించాడు. శ్రీమంతుడు సినిమాలో దర్శకుడిగా కొరటాల శివ కొద్దిగా తడబడ్డాడు. లక్ కలిసొచ్చి సినిమాలో నెగిటివ్ థింగ్స్ హైలట్ కాలేదు. అదే లక్ కంటీన్యూ అయితే శ్రీమంతుడు సినిమా కలక్షన్స్ కొట్టేసే రేంజ్‌లో ఇప్పుడు పరిస్థితులు వున్నాయి.

httpv://youtu.be/7O4Hm070Bc8

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జనతా గ్యారేజ్‌, Featured. Bookmark the permalink.

2 Responses to కొట్టేసినట్టే…

  1. Balaji అంటున్నారు:

    Comedy king hari …

  2. Hari అంటున్నారు:

    Balaji, నిజం చేదు అని తెలుసు. కొందరికి ఫన్నీగా కూడా వుంటుందని తెలియజేసినందుకు థాంక్స్‌!!!

వ్యాఖ్యలను మూసివేసారు.