రామ్‌చరణ్ తాజా చిత్రం ‘ధృవ’. తమిళ ‘తనీ ఒరువన్’కి రీమేక్. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఆఫీషియల్ ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఒకప్పుడు ఫ్యాన్సే సొంత డబ్బులు & టైం దూల తీర్చుకొని హాడావుడి చేసేవాళ్ళు. కాలం మారింది. ఇప్పుడు స్టార్ సినిమా హడావుడి చెయ్యడానికి ఫ్యాన్స్‌తో పని లేదు. ప్రతి స్టార్ హిరోకు(పవన్ కల్యాణ్‌కు మినహా) పబ్లిసిటీ చేసే టీం వుంది. వాళ్ళతో నిర్మాత హాడావుడి చేయిస్తాడు. ఫ్యాన్స్ చేయవలసిందల్లా, పబ్లిసిటీ టీం చేసే హాడావుడిని వీలైనంత మందికి షేర్ చెయ్యడమే. అల్లు అర్జున్ కు అయితే షేర్ చేసే టీం కూడా వుంది. మిగతా హిరోలకు కూడా వుండి వుండవచ్చు.
ధృవ – ఆఫీషియల్ ఫస్ట్ లుక్ హాడావుడి చూస్తుంటే, పబ్లిసిటీ చేసే టీం కష్టం/ప్రతిభ క్లియర్‌గా కనపడుతుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన క్షణల్లో బైక్ స్టిక్కర్లు .. ఫ్లేక్సీలు అంటే .. కచ్చితంగా నిర్మాత సహకారంతో చరణ్ పబ్లిసిటీ టీం చేసిన హాడావుడే ఇది. Well Done.
సినిమాను హైప్ చెయ్యడానికి రామ్‌చరణ్ కూడా కష్టపడుతున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నాడు.
ధృవ ఆఫీషియల్ ఫస్ట్ లుక్ విషయానికి వస్తే చరణ్ ఇదే మీసకట్టుతో విచ్చలవిడిగా పబ్లిక్ కు కనిపించడం వలన వైరటీ గెటప్ అనేలా ఏమీ లేదు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో చరణ్ “ఎవడు” సినిమాకు పనిచేసిన డిజైనర్‌నే ఈ సినిమాకు కూడా పని చేస్తున్నట్టు వున్నాడు.
bottomline:
ధృవ సినిమా కోసం చరణ్ పబ్లిసిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినందుకు మెగాఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.