మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ధ్రువ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” ఎపిసోడ్ వలన & పవన్‌కల్యాణ్ కు రామ్‌చరణ్ ఇచ్చే గౌరవం వలన, మెగాఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి వారసుడు రామ్‌చరణ్. మెగాఫ్యాన్స్‌కు చిరంజీవి. చిరంజీవి తర్వాత పవన్‌కల్యాణ్. పవన్‌కల్యాణ్ తర్వాత రామ్‌చరణ్. సక్సస్ .. ఫెయిల్యూర్స్ తో ఫ్యాన్స్‌కు పని వుండదు.
అల్లు అర్జున్ .. సాయి ధర్మ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. అల్లు శిరీష్ .. వీళ్లందరికీ మెగాఫ్యాన్స్ సపోర్ట్‌తో పాటు విమర్శలు కూడా వుంటాయి. విమర్శించినంత మాత్రాన సపోర్ట్ లేదనుకోకూడదు. వాళ్ళు సక్సస్ సాధించాలనే మెగాఫ్యాన్స్ కోరుకుంటారు. వాళ్ళు సక్సస్ సాధిస్తే ముందుగా ఆనందించేది మెగాఫాన్స్.
సక్సస్ గర్వంతో మెగాఫ్యాన్స్ అవసరం లేదనుకుంటున్న అల్లు ఫ్యామిలి వారి వ్యూహం ఎంత వరకు కరెక్ట్ అనేది చెప్పడం కష్టం. కాని వారి గట్స్‌ని కచ్చితంగా మెచ్చుకొవాలి.
ఇంకో కోణంలో: కష్టాన్ని నమ్ముకునే మెగా ఫ్యామిలీలో ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టాలనే ఆలోచన అల్లు ఫ్యామిలికి రావడం దురదృష్టం అని: చిరంజీవి, పవన్‌కల్యాణ్ & రామ్‌చరణ్ ల మీద ఈర్ష్యతో అల్లు అర్జున్‌ను పొగిడే టెంపరెరీ బ్యాచ్ కోసం మెగాఫ్యాన్స్‌ను దూరం చేసుకుంటున్న అల్లు ఫ్యామిలీ వ్యూహం కరెక్ట్ కాదని కూడా అనేవాళ్ళు వున్నారు.
మెగాఫ్యాన్స్‌ను వెర్రి పప్పలను చెయ్యాలనే ఆలోచన ఎవరిదో కాని, మెగా హిరోల మధ్య రిలేషన్స్ మాత్రం బాగానే వున్నాయి. రామ్‌చరణ్ మీద అల్లు అర్జున్‌కు “నేనేం తక్కువ మెగాఫ్యాన్స్ నాకేందుకు రామ్‌చరణ్‌కు ఇచ్చినంత గౌరవం ఇవ్వరు” అనే భావన వుండోచ్చు కాని, అల్లు అరవింద్‌కు మాత్రం రామ్‌చరణ్ అంటే సొంత కొడుకులతో సమానమే. ధ్రువ నిర్మించేది కూడా అల్లు అరవిందే.
bottomline:
ఇప్పటి వరకు వచ్చిన రామ్‌చరణ్ ప్రతి సినిమా ఎదో ఒత్తిడితో రిలీజ్ అవుతూ వుంటుంది. మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టి లబ్ది పొందాలనుకున్న అల్లు అర్జున్ వ్యూహం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో, ఈ రకంగా రామ్‌చరణ్‌పై ఎంతో ప్రెజర్ వుంది.