ఒక రోజు ముందే 'జనతా గ్యారేజ్'

JG-Sept-1

ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యి వుంది.

ఈ సినిమా పబ్లిసిటీ టీం చేస్తున్న హైప్‌కు దేవిశ్రీ ప్రసాద్ ఇరగదీసే మ్యూజిక్ ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటలకు ప్రాణం పొసాడు. హైప్ పెరిగింది.

టెంపర్, నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్.టి.ఆర్ నుంచి వస్తున్న సినిమా ఇది. మిర్చి, శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా.

ఎన్.టి.ఆర్ గత రెండు సినిమాలు మంచి పేరు వచ్చినా, కలక్షన్స్ ఆ స్థాయిలో లేవు. టెంపర్ మేసేజ్ ఓరెంటెడ్ కావడం, నాన్నకు ప్రేమతో క్లాస్ ఓరెంటెడ్ కావడం వలనెమోనని ట్రేడ్ వర్గాలు అనుకున్నాయి.

కొరటాల శివ గత రెండు సినిమాలు ఒకదాని మించి ఒకటి హిట్ అయ్యాయి. కొరటాల కష్టంతో పాటు టైం కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటూ వుంటాయి.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లక్ ఎలా వుందో. కొరటాల శివ లక్ కంటీన్యూ అయితే ప్రస్తుతం సినిమాపై వున్న హైప్‌కు వంద కోట్లు షేర్ ఈజీ. ముందుగా ఎనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ 2న కాకుండా ఒక రోజు ముందు సెప్టెంబర్ 1నే రిలీజ్ అవుతుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జనతా గ్యారేజ్‌, Featured. Bookmark the permalink.