అతి చిన్న వయసులో ఆది & సింహద్రీ సినిమాలతో మెగాస్టార్ చిరంజీవికే సవాలు విసిరాడు ఎన్.టి.ఆర్. ఆ రెండు సినిమాలు మాస్ ప్రేక్షకుల్లో ఎన్.టి.ఆర్ కు గట్టి పునాది వేసాయి. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ ను సరికొత్తగా చూపించడంలో చాలా మంది దర్శకులు సక్సస్ అయ్యారు కాని. ఎన్.టి.ఆర్ బాక్సాఫీస్ సత్తాను చూపించే సినిమాలు ఏ దర్శకుడూ ఇవ్వలేకపొయారు.
ఎన్.టి.ఆర్ కు వున్న బిగ్ ఎడ్వాంటేజ్ మాస్ ప్రేక్షకుల ఫాలోయింగ్. బృందావనం నుంచి క్లాస్ ప్రేక్షకుల ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈసారి క్లాస్ మెచ్చే మాస్ సినిమా కొరటాల శివ తీసుంటాడని తెలుగు ప్రేక్షకులు ఆశీస్తున్నారు. ప్రేక్షకులు ఆశీంచినట్టుగా కొరటాల శివ “జనతా గ్యారేజ్” సినిమా తీసుంటే, బాక్సాఫీస్ బాక్సులు బ్రద్దలవ్వడం ఖాయం.