తెలుగు సినిమాల సంఖ్య భారీగా పెరిగింది. తెలుగు హిరోల సంఖ్య పెరిగింది. తెలుగు హిరొల్లో ఇండస్ట్రీకి సంబంధించిన వారసులే ఎక్కువ. తెలుగుసినిమా తీరు మారింది. వంద రోజుల కలక్షన్స్ మూడు వారాల్లో సాధించవలసి వస్తుంది. మారిన తీరుకు భారీ ఓపినింగ్స్ రావాలంటే హైప్ చాలా అవసరమైంది. హైప్ కు భయపడితే ఓపినింగ్స్‌కు భారీ బొక్క పడుతుంది.కొందరు హిరోలకు ఆటోమెటిక్‌గా వచ్చేస్తాది. కొన్ని హిరో & డైరక్షన్ కాంబినేషన్‌కు కూడా వస్తుంది. హిరో సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమా హైప్ రావడం కూడా సహజం.
కొన్ని సినిమాలకు ఎంత హైప్ చేసినా రాదు. కొన్ని సినిమాలకు హైప్ వద్దన్నా ఆగదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ధృవ’ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాను రామ్‌చరణ్ టీం బాగా హైప్ చేసే ప్రయత్నం చేస్తున్నా, ఈ సినిమా తమిళ్ సినిమా రిమేక్ కావడంతో హైప్ తక్కువ వుంది. ఈ సినిమాకు బలం మెగా వారసుడు రామ్‌చరణ్ & మెగా అభిమానులు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొద్దినెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. మొదట ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ నెలలోనే విడుదల చేయాలని టీమ్ భావించినా, అన్ని పనులూ పూర్తికాకపోవడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది.
దసరా రోజున (అక్టోబర్ 11న) సాయంత్రం 5 గంటలకు ధృవ ఫస్ట్ టీజర్ విడుదలవుతుందని రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించాడు. నందమూరి అభిమానులకు జనతా గ్యారేజ్ సినిమా ద్వారా విజయానందం ధృవ సినిమా ద్వారా తమకు కూడా విజయానందం అందుతుందని మెగా అభిమానులు ఆశీస్తున్నారు.
ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఉత్సాహం క్రియేట్ చేసింది. టీజర్ ఏ మేరకు హైప్ క్రియేట్ చేస్తుందో !!!`