ధృవ కోసం భారీగా హాడావుడి ప్లాన్ చేస్తున్న మెగాఫ్యాన్స్

rc

మెగాఫ్యాన్స్(చిరంజీవి ఫ్యాన్స్)లో కొందరు పవన్‌కల్యాణ్‌ను విమర్శలు చేస్తూ వుంటారు. అవి ప్రేమతో చేసే విమర్శలే తప్ప, ద్వేషంతో చేసేవి కావు. సమయం వచ్చినప్పుడు విమర్శలు చేసే మెగాఫ్యాన్సే పవన్‌కల్యాణ్‌ను ఎంతో సపోర్ట్ చేస్తారు.పవన్‌కల్యాణ్ ను ఎలా విమర్శలు చేస్తారో అల్లు అర్జున్‌ను కూడా చేస్తారు. అంతే సపోర్ట్ చేస్తారు.

పవన్‌కల్యాణ్ అన్నయ్యను గౌరవించాలని మెగాఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో, బన్నీ కూడా మెగాబ్రదర్స్ ను & రామ్‌చరణ్‌ను గౌరవించాలని కోరుకుంటారు. బన్నీ మెగాఫ్యాన్స్ చేసే విమర్శలు చాలా సిరియస్ గా తీసుకొని, మెగాస్టార్ ను అడ్డుపెట్టుకొని పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు, నాకు నాన్-మెగాఫ్యాన్స్ సపోర్ట్ వుందని ఎక్కడా తగ్గటం లేదు.

బన్నీ మీద గుర్రుగా వున్న మెగాఫ్యాన్స్ ధృవ కోసం భారీగా హాడావుడి ప్లాన్ చేస్తున్నారు.ఒకప్పుడు “మెగాస్టార్ కు అల్లు అరవింద్ ఎంత ఒదిగి వుంటాడో, నేను కూడా రామ్‌చరణ్ కు ఒదిగి వుంటాను” అని చెప్పిన అల్లు అర్జున్, వరుస విజయాలు అందేసరికి “రామ్‌చరణ్ కంటే నేనేం తక్కువ” అన్న రీతిలో రెచ్చిపొవడం మెగాఫ్యాన్స్ జీర్ణించుకొలేకపొతున్నారు.

bottomline:
“మెగాస్టార్ ..” “పవర్‌స్టార్ ..” “మెగాపవర్‌స్టార్ ..” లను మెగాఫ్యాన్స్ మోస్తారు. వీళ్ళ తర్వాతే ఎవరైనా (బన్నీతో సహా). నాన్-మెగాఫ్యాన్స్ చేసే సపోర్ట్ చూసుకొని మెగాఫ్యాన్స్ ను దూరం చేసుకుంటున్న అల్లు అర్జున్ నిర్ణయం ప్రభావం అల్లు అర్జున్ పై ఎలా వుంటుందో తెలియదు కాని, రామ్‌చరణ్‌కు ఎడ్వాంటేజ్ అయ్యింది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.