ఈసారి పూరి జగన్నాధ్ వంతు

chiru-puri

కెరీర్ బిగినింగ్‌లో చిరంజీవి అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ, దర్శకులు చుట్టూ తిరిగేవాడు. తమ దగ్గరకు అవకాశాల కోసం తిరిగినోడంటే, తిప్పించుకునే వాడికి కొద్దిగా లోకువ వుంటుంది. అలా చిరంజీవి అంటే కొందరికి లోకువ.

ఇప్పుడు చిరంజీవి స్థానం వేరు. ప్రతి ఒక్కరిని పట్టించుకొవడం కష్టంగా వుండి వుండవచ్చు. కొందరు పెద్దలకు, కొందరు సమకాలీకులకు మాత్రమే గౌరవం ఇస్తాడు. చిరంజీవి నుంచి ప్రత్యేక అభిమానం ఆశీస్తూ, ఆ స్థాయిలో గౌరవం అందకపొవడం వలన భంగపడిన వాళ్ళు చాలా మంది వున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు ఓపెన్‌గా బయటపడుతూ వుంటారు. తమ్మారెడ్డి భరద్వాజ, ప్రతి పసంగంలో చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ వుంటాడు ఈయన. అలానే మొన్న కోదండరామిరెడ్డి కూడా బయటపడ్డాడు (కోదండరామిరెడ్డిలో కొద్దిగా సంస్కారం మిగిలి వున్నట్టు వుంది. వెంటనే తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు).

చిరంజీవి మీద అభిమానంతో చిరంజీవి సరైన నిర్ణయాలు తీసుకొవడం లేదని చిరంజీవి అభిమానులు విమర్శలు చెయ్యడం వేరు. చిరంజీవి సినిమా వస్తే చాలు, తాము చేసిన విమర్శలు అభిమానులు మరిచిపొతారు. (ఎప్పుడూ ఏడ్చే ఇంకో వర్గం, ఎప్పుడూ ఏడుస్తూనే వుంటుంది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు)

ఇప్పుడు చిరంజీవిపై విమర్శలు పూరి జగన్నాధ్ వంతయ్యింది. చిరంజీవి, తన 150 వ సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్‌తో చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆఫీషియల్‌గా ప్రకటించాడు కూడా. తగిన సమయం ఈ సినిమా కోసం వెచ్చించకుండా, వేరే సినిమాల కోసం వెచ్చిస్తూ చిరంజీవి 150వ సినిమా అవకాశం కొల్పోయి, తిరిగి చిరంజీవినే విమర్శలు చెయ్యడం మొదలుపెట్టాడు. సెకండాఫ్ నచ్చలేదని చెప్పినా, “నో” అని డైరక్ట్‌గా చెప్పలేదని frustration కు లోనయ్యాడు.

ప్రస్తుతం వస్తున్న మన స్ట్రైట్ తెలుగుసినిమాలన్నీ(90%) వేరే వేరే బాషల సినిమాల నుంచి ఆ సీన్లు ఈ సీన్లు కాపీ కొడుతూ తీసేవే అనే విషయాన్ని పక్కన పెట్టి, తన సినిమాను కాదని 150 వ సినిమాగా రిమేక్ సినిమాను ఎంచుకున్న చిరంజీవిని వుద్దేశించి “కొత్త కథలు చేద్దాం అనే ఫైర్ వాడిలో వుంటే కొత్త కథలు వస్తాయి. లేదు, రీమేక్‌లనే నమ్ముకుందాం అంటే వాళ్లు కొత్త కథలను సినిమాలుగా తీయలేరు. కొత్త కథలను అంగీకరించే ధైర్యం లేక రీమేక్‌లపై ఆధారపడుతున్నారు. రిస్క్ తీసుకునే గట్స్ చిరంజీవికి లేవు” అని అంటున్నాడు. ఒక పక్క రిమేక్ చేసే హిరోలకు గట్స్ లేవని విమర్శిస్తూనే, మరో పక్క టెంపర్ రిమేక్ చెయ్యమని అభిషేక్ బచ్చన్్‌ను అడిగానని చెపుతున్నాడు. పూరి జగన్నాధ్ కథ చేయకూడదని చిరంజీవి తీసుకున్న నిర్ణయం మీద, పూరి జగన్నాధ్ ఎంత గుర్రుగా వున్నాడో అర్దం చేసుకొవచ్చు.

మహేష్‌బాబు మీద కూడా frustration:
మహేష్ బాబుతో పూరి ‘జన గణ మన’ మూవీ చేస్తున్నట్లు కూడా ఆ మధ్య ప్రకటించారు. కథ నచ్చిందని చెప్పిన మహేష్ బాబు డేట్స్ మాత్రం ఇవ్వ లేదట. అయితే సినిమా చేస్తాడా? లేదా? అనే విషయమై మహేష్ బాబు సరైన క్లారిటీ ఇవ్వక పోవడంపై కూడా పూరి కాస్త అసహనం వ్యక్తం చేసాడు. ఎవరికీ నో అని చెప్పలేను, చెప్పడం ఇష్టం వుండదని మహేష్‌బాబు ఒక క్లూ కూడా ఇచ్చాడు. “నో” అని డైరక్ట్‌గా చెప్పలేదని frustrationలో వున్నట్టు వున్నాడు.

Note: పూరి కామెంట్స్ చిరంజీవిని వుద్దేశించి కాకపోయి వుంటే, పూరి & ఈ సైటు విజిటర్స్ కు క్షమాపణలు.

httpv://youtu.be/YaStvLn0jSs

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Mega Family. Bookmark the permalink.