హమ్మయ్య .. కీరవాణి పాడలేదు ..

bb2

కీరవాణి మంచి సింగర్ అయ్యు వుండవచ్చు. తెలుగు పదాలు చాలా స్పష్టంగా పలకగల్గే కెపాసిటీ వుండి వుండవచ్చు. సినిమా హిట్ అవ్వడం ఆయన పాటలు హిట్ అయ్యి వుండవచ్చేమో కాని, తన వాయిస్ కొన్ని కొన్ని సాంగ్స్‌కే సూట్ అవుతాది. కాని కొన్ని మంచి పాటలు కీరవాణి పాడటం వలన, రేంజ్ పడిపోతుంది.

ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా బాహుబలి 2 ఫస్ట్‌లుక్‌ సంకెళ్లు తెంచుకుంటూ సిక్స్‌ప్యాక్ బాడీతో, మెడలో గంటతో రఫ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాజమౌళి బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నదాని కంటే కూడా భారీ స్థాయిల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ఇప్పుడు బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. పోస్టర్‌తో పాటు ఒక సాంగ్ మ్యూజిక్ బిట్ కూడా రిలీజ్ చేసారు. హమ్మయ్య .. బాహుబలి2 టీజర్ సాంగ్‌లో కీరవాణి పాడలేదు. లుక్ & మ్యూజిక్ బాహుబలి1 ఎమోషన్ క్యారీ చేసే విధంగా వుంది.

httpv://youtu.be/5CHDp2pkvjs

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బాహుబలి. Bookmark the permalink.