గీతాఆర్ట్స్ బ్యానర్ లో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వస్తున్న మూవీ `ధృవ`. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తనీ ఒరువన్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
`నీ స్నేహితుడెవరో తెలిస్తే..నీ క్యారెక్టర్ తెలుస్తుంది… నీ శత్రువు ఎవరో తెలిసే..నీ కెపాసిటీ తెలుస్తుంది` అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ తో ఉన్న యాభై సెకన్ల టీజర్, మెగా అభిమానుల ప్రొత్సాహంతో సోషల్ నెట్‌వర్క్‌లో ట్రెండ్ సృష్టించింది. ఈరోజుతో సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యిందంట. రామ్‌చరణ్ కూడా సినిమాను హైప్ చెయ్యడానికి ఒక మంచి టీంను పెట్టుకున్నట్టు వున్నాడు. ఎప్పటికప్పుడు సినిమాను మంచి హైప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నవంబర్ మొదటివారంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పూర్తవుతుంది. ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్‌చరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపించనున్న అందరికీ తెలిసిందే.