ఇంట్రో సాంగ్ షూట్‌కు రెడీ అవుతున్న చరణ్!

charan

Upasana Kamineni ‏@upasanakonidela
Mr.C and I would like to wish everyone a very happy and prosperous Diwali. May you all be blessed with abundance of love and happiness.

This is what Mr.C is doing on Diwali! All set for his title song. #Dhruva #RamCharan @ApolloLifeStudio

రామ్‌చరణ్ సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అభిమానులతో టచ్‌లో వుండే ప్రయత్నం చేస్తున్నాడు. ఉపాసన కూడా రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.దీపావళి సందర్భంగా దంపతులిద్దరూ ధృవ సినిమా స్టిల్స్ తో పాటు, పర్సనల్ ఫోటోస్ కూడా అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ 2న ధృవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తికాగా నవంబర్ 2 నుండి మిగిలి ఉన్న ఒక్క ఇంట్రో సాంగ్‌ను కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం రామ్‌చరణ్ పడుతున్న కష్టాన్ని ఉపాసన తన ట్వీటర్ ఎకౌంట్ ద్వారా పొస్ట్ చేసింది.

తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కి రీమేక్ అయిన ఈ పోలీస్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూండగా, గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‍గా కనిపించనున్నారు.

httpv://youtu.be/oH1sTDfYdMA

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.