నేరుగా మార్కెట్‌లోకి ‘ధృవ’ ఆడియో

rc

మిగతా అభిమానులతో పోల్చుకుంటే మెగా అభిమానుల సంఖ్య ఎక్కువ. అనేక వర్గాలు వున్నాయి. కొద్దిగా తేడా జరిగినా, ఒక వర్గం మెగా హిరోలను విమర్శించడానికి మొహమాటపడరు. సోషల్ నెట్‌వర్కింగ్ పుణ్యమా ఆ విమర్శలు బహిరంగం అవుతున్నాయి. మెగా అభిమానుల్లోనే చిరంజీవిని విమర్శించే వాళ్ళు వున్నారు, పవన్‌ను విమర్శించే వాళ్ళు వున్నారు, చరణ్‌ను విమర్శించే వాళ్ళు వున్నారు. విమిర్శించిన వాళ్ళను దురాభిమానులు అనుకొవడం పొరబాటు. వారి విమర్శలు, చర్యలు చాలా చికాకు తెప్పిస్తాయి. హిరోలకు సహనం అవసరం. చిరంజీవి , పవన్ & చరణ్ .. అసహానానికి గురి అయిన సందర్భాలు వున్నాయి కాని, కంట్రోల్ చేసుకుంటారు.

మెగా అభిమానుల్లో ఒక వర్గం, అల్లు అర్జున్‌ను మెగా హిరో అని అనడానికి ఇష్టపడరు. మరో వర్గం అల్లు అర్జున్ ను దాటండి, తర్వాత మా చరణ్‌తో పోటి పడవచ్చు అని వాడుకుంటారు. ఇంకో వర్గం చరణ్ తో పాటు సమానంగానే చూస్తారు. కొన్ని సంవత్సారల క్రితం “అల్లు అరవింద్ చిరంజీవి అంటే ఎంత వినయంగా వుంటాడో, నేను చరణ్‌కు అంతే వినయంగా వుంటాను” అని చెప్పిన అల్లు అర్జున్, రెండు వరుస హిట్లు వచ్చేసరికి “నేనేం తక్కువ .. మెగా అభిమానులు నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నారు” అని ఫీల్ అయ్యి, తన అసహనాన్ని, చిరంజీవిని అడ్డుగా పెట్టుకొని, పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగా అభిమానులపై చూపించాడు.

“బొంగులో మెగా అభిమానుల సపోర్ట్ లేకపొతే నాకు వూడేది ఏమీ లేదు, సినిమా బాగుంటేనే ఎవరైనా ఆదరిస్తారు, మెగా అభిమానులతో నాకు పని లేద”ని, ప్రతి స్పీచ్‌లోనూ అల్లు అర్జున్ చెప్పిందే చెపుతున్నాడు. స్టైలింగ్ స్టార్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కన్నింగ్ స్టార్ వేషాలన్నీ మెగా అభిమానులందరూ గమనిస్తున్నారు. మెగా అభిమానుల మధ్య చిచ్చు రేపి లబ్ది పొందాలనుకుంటున్న, అల్లు అర్జున్‌కి తమ పవర్ ఏమిటో చూపించాలనుకుంటున్నారు. ధృవ హాడావుండి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

చిరంజీవి & రామ్‌చరణ్ లు కూడా అల్లు అర్జున్ ఫీలింగ్స్ కనిపెట్టినట్టు వున్నారు. రామ్‌చరణ్, తన సొంత టీంను ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏర్పర్చుకున్నాడు. గీతా ఆర్ట్శ్ టీంకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు వున్నాడు. రామ్‌చరణ్ ఆదేశాలతోనే ఈ సినిమా ప్రమోషన్ జరుగుతుంది. ఒక పద్దతి ప్రకారం హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ నెల 9న ‘ధృవ’ ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి వదిలేస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.