గీతా ఆర్ట్స్ అంటే చిరంజీవి బ్యానర్. అల్లు అరవింద్ అంటే చిరంజీవికి ఒక రక్షక కవచం. మెగా అభిమానులు అలా అనుకునే వారు. రక్షక కవచం అని ఎందుకు అనుకునే వారంటే చిరంజీవి తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాకపొయినా, నిర్ణయాలు తప్పు అనిపించినా , జనాలందరూ అల్లు అరవింద్‌ను తిట్టే వాళ్ళు.(మెగా అభిమానులతో సహా)
చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి చిరంజీవి లక్ & కష్టంతో పాటు అల్లు అరవింద్ ప్లానింగ్ కూడా ఎంతో ఊపయోగపడింది. తనపై వచ్చే విమర్శలను అల్లు అరవింద్ అసలు పట్టించుకున్నట్టు కనిపించేవారు కాదు. చిరంజీవి సక్సస్‌ని & డిమాండ్‌ని అడ్డుపెట్టుకొని, తెలుగుసినిమా పరిశ్రమలో అల్లు అరవింద్ తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు.
పవన్‌కల్యాణ్ కు కూడా అల్లు అరవింద్ మంచి గౌరవం ఇవ్వడంతో, గీతా ఆర్ట్స్ చిరంజీవిదే అని అనుకుంటున్న మెగా అభిమానుల నమ్మకం మరింత బలమైంది.
ప్రస్తుతం పరిస్థితులు అలా వున్నట్టు కనిపించడం లేదు. రామ్‌చరణ్ ఎంట్రీ & రామ్‌చరణ్‌ను మెగా అభిమానులు ఓన్ చేసుకుంటున్న తీరు అల్లు ఫ్యామిలీలో అభద్రతా భావం క్రియేట్ చేసినట్టు వుంది. మెగా అభిమానులు పవన్‌కల్యాణ్‌కు & రామ్‌చరణ్‌కు ఇచ్చే గౌరవం అల్లు అర్జున్‌కు ఇవ్వడం లేదనేదే వాళ్ళ అభద్రతా భావంకు కారణం అని మెగా అభిమానులు అంటున్నారు. ఈ విషయాన్ని డైరక్ట్‌గా చిరంజీవి దగ్గరో, చరణ్ దగ్గరో చెప్పుకొలేరు. మెగా అభిమానులు మధ్య గొడవలు పెట్టేసారు. పవన్‌కల్యాణ్‌ను అభిమానించే చిరంజీవి అభిమానులకు గీతా ఆర్ట్స్ లో కాని, చిరంజీవి ట్రస్ట్ లో కాని ప్రవేశం లేదు. నేను కేవలం చిరంజీవి అభిమానిని మాత్రమే అని చెప్పుకుంటేనే, వాటిల్లో ప్రవేశం. తద్వారా ఇది అల్లు వారి గీతా ఆర్ట్స్, చిరంజీవిది కాదు అని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. పవన్‌కల్యాణ్ ను అమితంగా అభిమానించే మెగా అభిమానులను చాలా అవమానాలకు గురి చేస్తున్నారు. రామ్‌చరణ్ మీద డైరక్ట్ గా చూపించలేక ఇలా చేస్తున్నారని, తప్పుడు రాజకీయ నిర్ణయాల ద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వున్న చిరంజీవికి అర్దం కావడం లేదు.
అల్లు ఫ్యామిలీ అంటే మెగా అభిమానులు ఎంత విరక్తి చెంది వున్నారో పై ఫోటోలో అల్లు బ్రదర్స్ ను కట్ చేసి పవన్‌కల్యాణ్ పెట్టారంటే అర్దం చేసుకొవచ్చు. పవన్‌కల్యాణ్ & రామ్‌చరణ్ లు కూడా ఈ విషయాన్ని గమనించి నట్టు వున్నారు. తమకంటూ సొంత మనుషులను క్రియేట్ చేసుకుంటున్నారు. అల్లు గుప్పెట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. “ధృవ” సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వస్తున్నా, సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం చరణ్ ఆదేశాల్లోనే జరిగాయని టాక్.
bottomline:
ధృవ సినిమాపై ప్రభావం చూపే అవకాశం:
మెగా అభిమానులందరూ రామ్‌చరణ్‌కు ఒక పెద్ద హిట్ ఇవ్వాలని చాలా కసిగా వున్నారు. కాని ఈ క్రింది విషయాలు మెగా అభిమానులకు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
- తెలుగుసినిమా అభిమానులందరూ తమిళ్లో చూసేసిన సినిమానే
- డిసెంబర్ నెల సినిమాలకు సీజన్ కాదు
- మరో నెలలో చిరంజీవి 150వ సినిమా వస్తుంది
- మెగా అభిమానులను దూరం చేసుకుంటున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది