ప్రస్తుతం చెల్లుబాటుగా వున్న 1000 నోట్లు , 500 నోట్లు రద్దు చేసారు. దానికి బదులుగా సరికొత్త 2000 నోట్లు, 500 నోట్లు ప్రవేశ పెట్టారు. కొత్త నోట్లు అందుబాటులో లేవు. వున్న నోట్లను మార్చుకొవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ ఎకౌంట్ లేని వాళ్ళ సంగతి సరే సరి. ప్రజలందరూ సహనంతో ఈ నిర్ణయం వలన మంచి జరుగుతుందనే ఆశతో కష్టాలు భరిస్తున్నారు.
దొంగ నోట్లు పనికిరావు. అక్రమంగా సంపాదించిన డబ్బు క్యాష్ రూపంలో వున్న వాళ్ళు, డబ్బులు పంచి పెట్టడం మినహా చేసేది ఏమి లేదు. ఇవి బాగానే వున్నాయి కాని,
- అవినీతి & లంచం తీసుకొవడం ఆగిపోతుందా?
- రూపాయి విలువ పెరుగుతుందా?
- అత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయా?
- ఇళ్ళ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయా?
ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది