నవంబర్ 25న సాయంత్రం 7 గంటలకు ‘ధృవ’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ‘ధృవ’ టీమ్ ప్రకటించింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ఎవరికీ తెలియదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం ఆసక్తి తగ్గకుండా ఆకట్టుకుంది.
సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘ధృవ’ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నాటితరం హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు.