పెద్ద సినిమాలకు వరస్ట్ రిలీజ్ నెల డిసెంబర్. కేవలం చిరంజీవి సినిమా సంక్రాంతికి వుండటం వలనే, చిరంజీవి కోసం చరణ్ తన సినిమాను ఇంకో నెల ఆగి సంక్రాంతి పండగకు రిలీజ్ చేసుకోకుండా, ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ చేసేస్తున్నాడు. ఎంతో కూల్‌గా, అసలు హాడావుడి లేకుండా, చాలా ధీమగా సినిమా షూటింగ్ చేసుకొని, ఇలా సినిమా రిలీజ్ డేట్ దగ్గర కాంప్రమైజ్ కావడం దురదృష్టకరమే.
చిరంజీవి చాలాకాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం. 150’ సంక్రాంతికి విడుదల కానుండగా, డిసెంబర్ 8న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇక ఆ తర్వాత రోజునుంచి ధృవ విడుదలవుతోన్న అన్ని థియేటర్లలో ‘ఖైదీ నెం. 150’ టీజర్‌ను ప్రదర్శిస్తారట.
మెగా అభిమానులు తమ స్టామినా ఏమిటో చూపించి ధృవ సినిమా కలక్షన్స్ చూపిద్దామంటే, నోట్ల కొరత వుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ధృవ కలక్షన్స్ ఎలా వుంటాయో ఇంటరెస్టింగ్.