ధృవ ఒరిజినల్ తమిళ్ “తని ఒరువన్” చూసావా?
Yes
రామ్‌చరణ్ ఈ సినిమా చెయ్యడం కరెక్టేనా?
ఏ సినిమా చెయ్యాలి ఏ సినిమా చెయ్యకూడదు అనే డెసిషన్ మెగా ఫ్యామిలీ కంటే వేరే వాళ్లకు తెలుసనుకొవడం కరెక్ట్ కాదు. ఒరిజినల్ తమిళ్ “తని ఒరువన్” చూసాక రామ్‌చరణ్ ఈ సినిమా ఎంచుకొవడం కరెక్ట్ కాదు అనిపించినా, ధృవ చూసాక రామ్‌చరణ్ ఈ సినిమా ఎంచుకొవడం కరెక్ట్ అనిపించింది. Well made, Stylish, no nonsense and very good thriller. సురేందర్ రెడ్డి చాలా బాగా తీసాడు.
సురేందర్ రెడ్డి ఈ సినిమా చెయ్యడం కరెక్టేనా?
ఏ దర్శకుడైనా, తాను దర్శకత్వం వహించే సినిమాలో తన మార్క్ కనిపించాలని కోరుకుంటాడు. వేరే బాషలో సెన్సేషనల్ హిట్ అయిన సినిమాను రీమేక్ చెయ్యడం కచ్చితంగా పెద్ద సవాల్. హరీష్‌శంకర్ గబ్బర్‌సింగ్ మాదిరి ఎక్కువ మార్పులు లేకుండా ప్రేక్షకులకు తీసిందే తీసినట్టు అనిపించకుండా, ఒరిజినల్ కంటే బాగా తీసాడని అనిపించుకొవడం చాలా కష్టం. సురేందర్ రెడ్డి ప్రిరిలీజ్ ఇంటర్వ్యూస్ లో రిమేక్స్ ఇంకా చెయ్యను అని చెప్పడంతో, ఎదో తేడా కొడుతుందని అనుమానాలు రేకేత్తించినా, సినిమా చూసాక, సురేందేర్ రెడ్డికి 100/100 మార్క్స్ ఇవ్వకుండా వుండలేము.
అరవింద్ స్వామి ప్రత్యేకత ఏమిటి?
వేరే వాళ్లను వూహించుకొవడం కష్టం. ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్.
రామ్‌చరణ్ ఎలా చేసాడు?
అరవింద్ స్వామికి ధీటుగా చెయ్యాలనే ఆలోచనే ఎంతో భయం కలుగజేస్తుంది. అటువంటిది, చరణ్ ఏ మాత్రం తగ్గకుండా చేసాడు. మెగా అభిమానులు కచ్చితంగా గర్వంగా చెప్పుకునే మరో సినిమా ధృవ.
ఇంకా ఎవరెవరు బాగా చేసారు?
పొసాని & నవదీప్. Well done too.
సురేందర్ రెడ్డి ఎక్సపెట్ చేస్తున్నట్టు , ఓవర్‌సీస్ 2 మిలియన్స్ మూవీ అవుతుందా?
2 మిలియన్స్ చేయవలసిన మూవీనే.
చిరంజీవి రాజకీయ వైఫల్యంతో & పార్టీని కాంగ్రెస్ లో కలపడం వలన, చిరంజీవి అంటే కుళ్ళు(yes. ఇంకా కుళ్ళు వుంది), చిరంజీవి అంటే జాలి, చిరంజీవి అంటే అసహ్యం, చిరంజీవి అంటే కోపం, చిరంజీవి అంటే చిన్నచూపు .. ఇలా చిరంజీవి మీద లేని ఎమోషన్ అంటూ లేదు. దాని ప్రభావం రామ్‌చరణ్ మీద బాగా పడుతుంది. దానికి తోడు అన్నీ మాస్ సినిమాలే చెయ్యడమో, అరిగిపొయినా ఫార్ములా సినిమాలు చెయ్యడం వలనో, రామ్‌చరణ్ సినిమాలకు ఓవర్‌సీస్ లో తన రేంజ్‌కు తగ్గ మార్కెట్ లేకుండా చేసాయి. 2 మిలియన్స్ చెయ్యకపొయినా, రామ్‌చరణ్ మీద పాజిటివ్ ఓపినియన్ క్రియేట్ చేసే సినిమా అని కచ్చితంగా చెప్పవచ్చు.