అమ్మడు .. let's do కుమ్ముడు

ధృవ విషయంలో, రామ్‌చరణ్ పై మెగాఫ్యాన్స్ తో సహా చాలామంది ఆ తమిళ్ సినిమా “తని ఒరువన్”ను రీమేక్ చెయ్యడం ఏమిటని ఎన్నో విమర్శలు చేసారు. ఖైదీనెం150 పై కూడా అటువంటి విమర్శలు వున్నాయి. ధృవ సినిమా చూసాక, విమర్శలు చేసిన నోళ్ళతోనే రామ్‌చరణ్ పై ప్రశంసంలు కురిపించారు. సురేందర్ రెడ్డి ఓన్ చేసుకొని ఎంతో శ్రద్దతో ఆ సినిమాను తెరకెక్కించిన విధానం తమిళ్ కంటే తెలుగులో బాగుందని అనిపిస్తే, రామ్‌చరణ్ లుక్ & పెరఫార్మన్స్ హైలట్‌గా నిలిచింది.

ఖైదీనెం150 సినిమా తమిళ్ కత్తి సినిమా రీమేక్ అనే విమర్శలు మాత్రమే కాదు, ఈ సినిమా రిలీజ్ టైంకే బాలకృష్ణ వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ వుండటమే కాదు, ఆ సినిమా బాహుబలికి ధీటుగా నిర్మించడంతో మరోరకమైన ఒత్తిడి మొదలైంది. చిరంజీవి ఇంకా ఇటువంటి అవుట్ డేటేడ్ మాస్ స్టిల్స్ తో ఇటువంటి సాదాసీదా సినిమా చెయ్యడం ఏమిటని కొందరు విమర్శలు చేస్తున్నారు. ధృవ సినిమా మాదిరి, ఖైదీనెం150 సినిమా కూడా సినిమా వచ్చాక అవే విమర్శలు, ప్రశంసంలుగా మారతాయని ఆశీద్దాం.

ఖైదీ నెం 150 ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఖైదీ నెం 150 ఆడియోను ఘ‌నంగా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసారు. అయితే, ఇప్పుడు ఆడియో ఫంక్ష‌న్ క్యాన్సిల్ చేసారు. ఈనెల 25న ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ను జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్ లో భారీ స్ధాయిలో చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

రేపు ఖైదీ నెం 150 మూవీలోని అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్ ను రిలీజ్ చేయ‌నున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.