ఈసారి గట్టిగా కొట్టడం ఖాయం

Sateesh Botta ‏@bkrsatish
Ee sari gattiga kottadam khayam #KhaidiNo150 #MegaStar

ఒకసారి స్టార్ హిరో ఇమేజ్ వచ్చాక, హిరోకు కథ నచ్చితేనే ఆ హిరోతో ఆ కథను తెర మీద చూసే అదృష్టం/దురదృష్టం ప్రేక్షకులను వరిస్తుంది.

ఎవరి నమ్మకం వాళ్లది. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి భయం వాళ్ళది. ఎవరి వ్యూహం వాళ్ళది. ఎవరి ఫార్ములా వాళ్ళది. ఈ ఛాన్స్ హిరోలకు మాత్రమే వుంది. దర్శకులకు లేదు.

రాంగోపాలవర్మ, తను నమ్మిన ఒక కథను(W/O వరప్రసాద్) పవన్‌కల్యాణ్ ఒప్పుకొలేదనే కోపంతో, పవన్‌కల్యాణ్ మీద ఒక రకమైన ద్వేషం పెట్టుకొని, ఆ ద్వేషాన్ని రోజు రోజుకు పెంచుకునే పనిలో వున్నాడు. ఈ విషయం పవన్‌కల్యాణ్ చెపితే అందరికీ తెలిసింది. పైకి మాత్రం పవన్‌కల్యాణ్ అభిమాని అని వెటకారం చేస్తూ వుంటాడు.

ఇదే విధంగా చిరంజీవితో కూడా విభేదాలు వచ్చి వుంటాయి. రాంగోపాలవర్మ చెప్పడు. పైకి అభిమానినే అని చెప్పుకుంటూ వుంటాడు. చిరంజీవి తన రీఎంట్రీ ఎలా చెయ్యాలనేది తన ఇష్టం. పూరి జగన్నాధ్‌తో అనుకొని ఎనౌన్స్ కూడా చేసారు. పూరి జగన్నాధ్ దృష్టి సారించి & టైం స్పెండ్ చేసి చిరంజీవికి నచ్చే విధంగా కథను తయారు చేసే పనిలో వుండకుండా, చాలా లైట్‌గా తీసుకొని అవకాశం కోల్పోయాడు.

నోటి దురద పూరి జగన్, తనతో సినిమా చెయ్యలేదని రాంగోపావర్మతో చిరంజీవి పిరికోడనో చిరంజీవి అదనో ఇదనొ డిస్కషన్ వచ్చి వుంటుంది. అంతే. రాంగోపాలవర్మ, తన ద్వేషాన్ని 1) ఈ సినిమా చిరంజీవి 150 వ కాదు అని మొదలు పెట్టాడు(సినిమా టైటిల్ లోనే 150 వుండటానికి రాంగోపాలవర్మ ప్రధాన కారణం), 2) మెగాస్టార్ అయ్యి వుండి తమిళ్ సినిమా రిమేక్ చెయ్యడం పిరికితనం అని కొన్ని వేల ట్వీట్స్ చేసాడు. ఇంకా చేస్తూనే వున్నాడు. ఇప్పుడు కొత్తగా, అదే సమయంలో రిలీజ్ అవుతున్న బాలకృష్ణ “గౌతమీ పుత్ర శాతకర్ణి” తో పొలుస్తూ శునకానందం తీర్చుకుంటాడు.

ఇక్కడ విషయం ఏమిటంటే, రాంగోపాలవర్మ ట్వీట్ చేసే విషయాలు, కొంతమంది మెగాఫ్యాన్స్ కు కరెక్ట్ గా 100% కనెక్ట్ అవుతాయి. ఖైదీనెం 150 స్టిల్స్, వినాయక్ స్టిల్స్ ఫుల్ మాస్ లుక్‌తో వుంటే, పాటలు దేవిశ్రీ స్టైల్లో ఫుల్ యూత్‌ఫుల్ గా వున్నాయి. 100% కాన్ఫిడెన్స్ తో అభిమానులు తొడలు కొట్టేవిధంగా లేవు. ఆ కథలో, ఆ యూత్‌ఫుల్ పాటల్లో చిరంజీవిని వూహించుకొవడం కొంతమంది చిరంజీవి అభిమానులకు కష్టంగా వుంది. ఈ వీక్‌నెస్‌ను రాంగోపాలవర్మ బాగా వాడేసుకొని తెగ రెచ్చిపోతున్నాడు.

కొంతమంది మెగా అభిమానులు మాత్రం, ఈ సినిమా దర్శకుడు వినాయక్ మాదిరి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్‌తో వున్నారు. ఇనిస్టెంట్ హిట్ కాకపొయినా, రిపీట్ హియరింగ్స్‌లో, రిలీజ్ అయిన రెండు పాటలు చాలా బాగున్నాయని అంటున్నారు. ఈసారి గట్టిగా కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయిపొయారు.

bottomline:
ఎవరెన్ని & ఎవరేమి కామెంట్ చేసినా ఖైదీనెం 150 బిగ్ కమర్షియల్ హిట్ అవ్వడం ఖాయం

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.