తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డే సినిమా 'శాత‌క‌ర్ణి'

క‌లియుగ దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి పాదాల చెంత‌నున్న తిరుప‌తిలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో ఆవిష్క‌ర‌ణ కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు చేతుల మీదుగా సోమవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఆడియో సీడీల‌ను నారా చంద్ర‌బాబు నాయుడు విడుద‌ల చేయ‌గా తొలిసీడీని వెంక‌య్య‌నాయుడు అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ తన స్పీచ్‌లో తెలుగు జాతి గర్వపడే సినిమా తీసానంటున్నాడు. కాకపొతే ఈసారి క్రిష్ దురదృష్టం ఏమిటంటే, మాసే లక్ష్యంగా మాస్ డైరక్టర్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీనెం 150‘ తో పొటీపడుతూ రిలీజ్ అవ్వడం కమర్షియల్‌గా ఈ సినిమాకు పెద్ద దెబ్బ. చిరంజీవికి క్రిష్ మీద చాలా గౌరవం వుంది కాబట్టి, చిరంజీవితో టచ్‌లో వుండి ఒకే టైంలో రిలీజ్ వుండకుండా ప్లాన్ చేయవలసింది.

ఈ సినిమా టైటిల్‌కు ముందు మా అమ్మ‌గారి పేరు పెట్టాను. ఈ సినిమాతో మా అమ్మ‌గారి పేరు నిల‌బెడ‌తాను.

అలాగే పెళ్లైన త‌ర్వాత ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కూడా నా భార్య‌తో ఉండ‌లేదు. నా భార్య చాలా గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాను.

తెలుగు జాతి గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాను.

క్రిష్

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in గౌతమీపుత్ర శాతకర్ణి. Bookmark the permalink.