క్లాస్ vs మాస్

ఖైదీనెం 150 vs గౌతమిపుత్ర శాతకర్ణి, ఈ సంక్రాంతి చాలా ఇంటరెస్ట్‌గా వుంది. ఒకటి చిరంజీవి 150వ సినిమా, ఇంకోటి బాలకృష్ణ 100వ సినిమా. ఒక సినిమాకు డైరక్షన్ పక్కా మాస్ డైరక్టర్, ఇంకో సినిమాకు పక్కా క్లాస్ డైరక్టర్. మాస్ డైరక్టర్ చేతిలో పక్కా హిట్ తమిళ్ ఫిలింకు చిరంజీవి తోడయ్యాడు, క్లాస్ డైరక్టర్ చేతిలో యుద్ధ నేపధ్యంకు బాలకృష్ణ తోడయ్యాడు.

క్లాస్ సినిమాతో మాస్‌ను మెప్పించడం చాలా కష్టం. అదే గౌతమిపుత్ర శాతకర్ణికి బిగ్ ఛాలెంజ్. అదృష్టం ఏమిటంటే, ప్రేక్షకుల ప్రిఫరెన్స్ గత కొద్ది కాలంగా మారుతూ వస్తుంది. క్లాస్ సినిమాలకు అన్ని వర్గాల నుంచి ఆదరణ పెరుగుతుంది. బాలకృష్ణ ప్రెజెన్స్ ప్లస్ కాబట్టి, గౌతమిపుత్ర శాతకర్ణి తో క్రిష్ మాస్ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యి, తన రేంజ్ పెంచుకుంటాడెమో చూడాలి.

మాస్ సినిమాతో క్లాస్‌ను మెప్పించడం కష్టం కాదు & మాస్ సినిమా ఒక హిట్ తమిళ్ సినిమాకు రీమేక్. అలా అని ఇక్కడ కూడా హిట్ అవ్వుద్దని గ్యారంటీ ఏమీ లేదు. ఒక యంగ్ హిరో చేయవలసిన రోల్, చిరంజీవి ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాడు. పాటలు కూడా యూత్ హిరో చేయవలసిన సాంగ్స్ లా వున్నాయి. పదేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న చిరంజీవి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

bottomline:
నిజానికి ఈ రెండు సినిమాలకు పోలిక లేదు. డిఫరెంట్ జోనర్. కాని చిరంజీవి & బాలకృష్ణ హిరోలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది.

కంచె సినిమా ద్వారా మెగా అభిమానులకు బాగా కనెక్ట్ అయిన క్రిష్, ఇలా డైరక్ట్‌గా చిరంజీవి సినిమా రోజునే తన తర్వాత సినిమా రిలీజ్ చేయవలసి రావడం దురదృష్టకరం.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in గౌతమీపుత్ర శాతకర్ణి, Featured. Bookmark the permalink.