బన్నీకి దొబ్బులెట్టిన నాగబాబు

మొన్న బన్నీని వైజాగ్‌లో ఓ అభిమాని మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నెంబ‌ర్ 150` ఎలా ఉండ‌బోతుంద‌ని అడిగాడు. బ‌న్నీ జ‌వాబిస్తూ `ఈ సంక్రాంతి మ‌న‌దే`నని వ్యాఖ్యానించాడు. అడ్డంగా బొకాయిస్తే తప్ప, ఇది కచ్చితంగా, అదే సమయంలో రిలీజ్ అవుతున్న బాలకృష్ణ శాతకర్ణిని వుద్దేశించి ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడానికి ఇచ్చిన జవాబు అని అందరూ ఒప్పుకొవాల్సిందే.

పాపం నాగబాబు ఆ కామెంట్స్ చూసి/విని వుండడు. ఎందుకంటే, ఈ నాగబాబు, నిస్సాహాయులు & అల్ప సంతోషులు అయినా మెగా అభిమానుల మీద రెచ్చిపొతాడు కాని, బన్నీని ఇలా డైరక్ట్‌గా కామెంట్ చేసేంత సీను నాగబాబుకు లేదు. కాకపొతే ఈ విడియోలో నాగబాబు పీకిన క్లాసు బన్నీకి దొబ్బులెట్టినట్టు వుందని అంటున్నారు మెగాఫ్యాన్స్.

మెగాఫ్యాన్స్ & నందమూరి ఫ్యాన్స్ మధ్య మాటల గొడవలు సహజం. హద్దు మీరనంత వరకు నొప్రొబల్మం. బన్నీ లాంటి హిరోలు వాళ్ళను రెచ్చగొట్టే విధంగా, మీరు మీరు కొట్టుకు చావండి. మేము మేము బాగుంటాం అని అనుకుంటే ఎలా? .. మొన్న సరైనోడు ప్రమోషన్ సభలో మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టిన బన్నీ ఇప్పుడు, నందమూరి & మెగాఫ్యాన్స్ మధ్య జరిగే మాటల యుద్ధాలకు పెట్రోలు పోసే ప్రయత్నం చేయడం దారుణం. బన్నీకి అందరి హిరో అభిమానుల సపోర్ట్ కావాలి, నందమూరి ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని జీవితాంత కాలం ద్వేషిస్తునే వుండాలని ఇలా ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టే మాటలు బన్నీ మానుకొవాలి.

bottomline:
బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. చిరంజీవి 150వ చిత్రం ఖైదీనెం150. ఈ రెండు సినిమాలు 2017 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధాలు సహజం. అంత సిరియస్‌గా తీసుకో అక్కర్లేదు.

నాగబాబు ఫ్యాన్స్ కి దొబ్బేలెడదాం అనుకొని, తనకు తెలియకుండానే ఇలా బన్నీకి దొబ్బులెట్టడం బాగుందని, నాగబాబు & బన్నీ చేష్టలతో అవమానాలకు గురి అయిన మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

httpv://youtu.be/PfFXwxkhLsc

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in just4FUN. Bookmark the permalink.