రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు

చిరంజీవి రిఎంట్రీ ఇస్తూ వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. పాటలు ఒక్కటొక్కటిగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తూ వచ్చారు. న్యూఇయర్ సందర్భంగా నాలుగో పాట వదిలారు. ఈ ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. ‘రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు’ అని సాగే ఈ పాట ఇనిస్టెంట్ హిట్ అయ్యింది.క్లాస్‌కు కూడా విపరీతంగా నచ్చే ఈ సాంగ్కు రాఘవా లారెన్స్‌ కొరియోగ్రఫీ అందించారు.

కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 4న ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

httpv://youtu.be/qxbYl3kWHKA

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.