సంక్రాంతి మూవీస్ అన్నీ హిట్టే !!!

Ram Gopal Varma ‏@RGVzoomin
My new Year wishes to each superstar is that all other superstars films should flop badly and all their fans should convert to u

May the new Year bring in more prosperity and happiness into ur house than ur neighbours house

May the new Year bring more profit to u than to ur competitor and may it make all his clients desert him and come running to u

I heartily wish the new Year will make only ur children get better grades in exams and it will fail all ur neighbours children

May the new Year grant ur most important wish that the woman in ur life will not find out about the other women in ur life

రాంగోపాలవర్మ లా కోరుకునే మనుషులు లేరు అనలేము కాని, అన్నీ సినిమాలు బాగా ఆడాలి .. మా సినిమా ఇంకా బాగా ఆడాలనేది మా విష్ అని అంటూ, పోటిలో వుండే హిరోలందరూ లౌక్యంగా చెప్పే మాట. లౌక్యం కోసం చెపుతున్నారు, మనసులో మాత్రం రాంగోపాలవర్మ మాదిరి అనుకుంటున్నారు అని అనుకుంటే కూడా పొరబాటు. అందరూ బాగుండాలి. అందరితో పాటు మనం బాగుండాలి అనుకొవడం కరెక్ట్.

ఎవరి సక్సస్ ట్రాక్ వారిది. కాని ఒకేసారి రిలీజ్ కావడంతోనే ఈ పోటీ వాతావరణం.ప్రేక్షకులను ఆకట్టుకొవడానికి ఎవరి వ్యూహాలు వాళ్ళవి. నాగబాబు చెప్పినట్టు మనం మాత్రమే బాగుండాలి, మనతొ పోటిపడుతున్నాడు కాబట్టి, మనతో పోటిపడేవాడు సర్వ నాశనం అయిపొవాలి అనుకొవడం నీచం. మనం గొప్ప అని నిరూపించుకొవడానికి ఇంకోకరిని కించపరచడం ద్వారా సాధించవచ్చు అనుకుంటే, అది గొప్పే కాదు. అలా అని నందమూరి ఫ్యాన్స్ & మెగా ఫ్యాన్స్ మధ్య సరదాగా(ఒకోసారి శృతి మించవచ్చు) జరిగే మాటల యుద్ధాలను కూడా అంత సిరియస్‌గా తీసుకోనక్కర్లేదు.

2017 సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు “ఖైధీ నంబర్ 150” & “గౌత్రమిపుత్ర శాతకర్ణి” భారీ బడ్జెట్‌తో నిర్మింపబడిన చిత్రాలు అయితే, ఒకటి లో బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం “శతమానం భవతి”.

అభిమానం పక్కనపెట్టి, ఈ మూడు సినిమా మేకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, సంక్రాంతి మూవీస్ అన్నీ హిట్టే అనిపిస్తుందంటున్నారు సినిమా ప్రేమికులు.

“శతమానం భవతి” – ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాం అని ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అనుకునే మూవీ.

“గౌతమిపుత్ర శాతకర్ణి” – ఈ సినిమా తీసినందుకు క్రిష్ & బాలకృష్ణ ఎంత గర్వపడుతున్నారో, ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అదే విధంగా గర్వించే సినిమా కావాలి.

“ఖైదీ నంబర్ 150” – చిరంజీవి అంటే అందరికీ గౌరవమే. కాని, చిరంజీవి చూపించే మెతకతనం వలన, కొందరు సెలబ్రీటీస్ చిరంజీవిని వెటకారం చెయ్యడానికి భయపడటం లేదు. వారందరికీ సమాధానం చెప్పాలంటే రెండు మార్గాలు. 1) వెటకారం చేసే ప్రతి సెలబ్రేటినీ మరింత వెటకారం చెయ్యడం. 2) కుక్కలు అలానే మొరుగుతాయి అని అనుకుంటూ తన సినిమా ద్వారా సమాధానం చెప్పడం. చిరంజీవి రెండో మార్గాన్నే ఎంచుకుంటాడు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులను సంతృప్తి పరిచే విధంగా వి.వి. వినాయక్ తీసివుంటాడని(ధృవ సినిమాను సురేందర్‌రెడ్డి తెరకెక్కించినట్టు) ఆశీద్దాం.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in గౌతమీపుత్ర శాతకర్ణి, Featured. Bookmark the permalink.