‘చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న మొదటి చిత్రం అన్నయ్య నటించిన ఖైదీ నెం 150 కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు’
— పవన్ కళ్యాణ్
మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈవెంటులో పవన్‌కల్యాణ్‌తో సహా మెగా ఫ్యామిలీ ఒకే వేదిక పైకి చేరి చిరంజీవికి వెల్కమ్ చెబితే చూడాలని మెగా అభిమానులంతా అనుకున్న మాట వాస్తవం.
రామ్‌చరణ్ చెప్పినట్టు పవన్‌కల్యాణ్ చిన్న పిల్లాడు కాదు కదా. రావాలా వద్దా, ఎందుకు రావాలి? ఎందుకు రాకూడదు? అనే విషయాలు పవన్‌కల్యాణ్‌కు తెలియవా? .. పవన్‌కల్యాణ్ రాకపొవడం అనేది కొత్త విషయం కాదు. కారణం చిరంజీవి ఆశ్వీరాదాలు పవన్‌కల్యాణ్‌కు కావాలి. అంతే కాని, తన అవసరం చిరంజీవికి రాకూడదని కోరుకునే వ్యక్తి పవన్‌కల్యాణ్. సర్దార గబ్బర్‌సింగ్ ఆడియో ఫంక్షన్ చూస్తే, అన్నయ్యకు తను ఇచ్చే గౌరవం ఏమిటనేది ఎవరికైనా తెలుస్తుంది.
రివర్స్‌లో, పవన్‌కల్యాణ్ ఆశ్వీరాదాలు చిరంజీవికు కావాలి అన్నట్టు, పవన్‌కల్యాణ్ రాకపొతే, పవన్‌కల్యాణ్ ఏదో దేశద్రోహం చేసినట్టుగా టెన్షన్ క్రియేట్ చెయ్యడం వెనుక ఎవరి హస్తం వుందనో అనుమానాలు రేకేత్తిస్తున్నారు.!!!
bottomline:
పవన్‌కల్యాణ్ వస్తే బాగుంటుంది. రాకపొతే, పవన్‌కల్యాణ్‌కు అన్నయ్యంటే కృతజ్ఞత లేనట్టు కాదు. రావడం లేదు, పవన్ కు విశ్వాసం లేదనే ఈ నెగిటివ్ గ్లోబల్ ప్రచారం వెనుక ఎవరి హస్తమో వుంది.