ఖైదీ నెంబర్ 150 చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం పేరు. ఈ చిత్రానికి మాతృక తమిళ కత్తి చిత్రం. ఈ చిత్రం ద్వారా చిరంజీవి దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలో ప్రవేశించాడు. ఇప్పటికే ఆడియో సూపర్ హిట్. ఈరోజు ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. ఈ ఫంక్షన్ సినిమా హైప్ కోసం జరుగుతున్నట్టు కాకుండా, చిరంజీవిని “welcome back to movies” చేస్తున్నట్టు చేస్తున్న నిర్మాత రామ్‌చరణ్ & అల్లు అరవింద్ లు అభినందనీయులు.
ఖైదీనంబర్ 150 అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ చేసారు. అదిరిపోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్న యూత్ రోల్‌లో, చిరంజీవి రామ్‌చరణ్‌కు అన్నయ్యలా వున్నాడు.
వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
httpv://youtu.be/UwYfxVlwy64