ఇష్టమైన వాడు కావాలని ఉమ్మివేసినా, పొరబాటున వేసాడనుకుంటారు. అదే పగోడు పొరబాటున పక్కన ఉమ్మివేసినా, అవమానించడానికే వేసి వుంటాడని అనుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అలానే వుంది.
పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగా అభిమానులను అవమానించడం ద్వారా, కొందరు మెగా అభిమానులకు అల్లు అర్జున్ పగోడు అయిపొయాడు. అల్లు అరవింద్ చిరంజీవికి ఇచ్చే గౌరవం, అల్లు అరవింద్ రామ్‌చరణ్‌పై చూపించే ప్రేమే ఇంకా అల్లు అర్జున్‌ను, మిగతా మెగా అభిమానులు దూరం కాకుండా కాపాడుతుంది.
నిన్న ఖైదీ నెం 150 మెగా ఫంక్షన్‌లో, అల్లు అర్జున్ చేసిన వెకిలి చేష్టలు, చాలా చెండాలంగా వున్నాయని మెగా అభిమానులు అనుకుంటున్నారు. మొన్న సంస్కారం లేకుండా, శాతకర్ణిని అవమానిస్తూ సంక్రాంతి మనదే అని మెగా అభిమానులను రెచ్చగొట్టిన అల్లు అర్జున్, ఈరోజు శాతకర్ణి కూడా హిట్ అవ్వాలని సంస్కారంతో కోరుకుంటున్నాని అనటం కూడా పెద్ద ఓవర్ యాక్షన్ అని మెగా అభిమానులు అంటున్నారు.