ఇదంతా పూరి జగన్నాధ్ కోసమే ..

జీవితం మీద విరక్తి కలిగినోళ్ళు రాంగోపాలవర్మ ట్వీటర్ ఎకౌంట్ ఓపెన్ చేసి, ఆయన ట్వీట్స్ చదివితే, చాలా రిలీఫ్ అయ్యి, జీవితం మీద మళ్ళీ ఆశ కలుగుతుందని, తను మూడ్ ఆఫ్‌లో వున్నప్పుడు అదే చేస్తానని మొన్న నాగార్జున అన్నాడు.

కాని, ఈ మధ్య మెగా ఫ్యామిలీ మీద, మెగా మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. కారణాలు ఏమిటనది అందరి ఊహలే. నిజాలు ఎవరికీ తెలియదు.

కొందరి మెగా అభిమానుల ఊహ:

  1. మెగాఫ్యామిలీని విమర్శిస్తే, మీడియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, వచ్చే మైలేజ్ ఏమిటనేది రాజశేఖర్-జీవిత దంపతులు బెస్ట్ ఎక్సాంపుల్.
  2. మెగా ఫ్యామిలీకి సొంత మీడియా లేదు. తెలుగుదేశం మీడియా సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి రాజకీయ ప్రవేశంతో జగన్ మీడియా కూడా మెగాఫ్యామిలీ మీద విరుచుకు పడుతుంది. మెగా ఫ్యామిలీ మీద ఎంత నెగిటివ్‌గా మాట్లాడితే, ఆయా మీడియాలో అంత ప్రాధాన్యత సంతరించుకుంటుందన్న విషయం రాంగోపాలవర్మకు బాగా తెలుసు.
  3. శ్రీనువైట్ల, బాద్‌షా లో రాంగోపాలవర్మను బాగా వెటకారం చేసాడు. తన మీద వెటకారాన్ని ఈజీగా తీసుకుంటానని చెప్పే రాంగోపాలవర్మ, శ్రీనువైట్ల మీద పగ పెంచుకొని, “ఆగడు” సినిమా ఒక ట్వీటుతో వెటకారం చేసాడు. “బ్రూస్‌లీ” మెగా మూవీ కావడంతో ఒక వారం రోజులు పాటు తన దాడిని సాగించాడు.
  4. టైటిల్‌లో 150 వుండటానికి కారణం రాంగోపాలవర్మే అని కూడా టాక్ వుంది. పూరి జగన్నాధ్‌తో చేస్తానని ఎనౌన్స్ చేసి కూడా, లాస్ట్ మినిట్‌లో మనసు మార్చుకొని వినాయక్ వైపు వెళ్ళారు. ఆ నిర్ణయాన్ని వెటకారం చేస్తూ 151 సినిమా అని బాగా ప్రచారం మొదలు పెట్టాడు. ఆ ట్వీట్లను మీడియా ఎక్కడ హైలట్ చేస్తుందనే భయంతో, టైటిల్‌లోనే 150 అని పెట్టారని టాక్.
  5. వాళ్ళు సినిమా మేకర్సే. వాళ్ళు సినిమాలు తీయగలరు. చిరంజీవికి పనికిమాలిన సలహాలు ఇచ్చే బదులు, వాళ్ళే వాళ్ళకు కావల్సిన సినిమాలు తీసుకోవచ్చు కదా అన్నది పబ్లిక్ అభిప్రాయం కాని, చిరంజీవి మీద పనికిమాలిన కామెంట్స్ చేస్తూ, వార్తల్లో వుండాలన్నదే వాళ్ళ లక్ష్యంగా చేసుకొవడం దురదృష్టకరం. వాళ్ళంత వాళ్ళు మారే అవకాశం లేదు. నాగబాబు ఇచ్చిన స్ట్రోక్ ప్రభావం ఏమిటనేది కొద్ది కాలం ఆగితే కాని చెప్పలేము.

bottomline:
మెగాఫ్యామిలీ మీద వెటకారానికి మీడియా సపొర్ట్ వుంటుందని గ్రహించి, సరదాగా గిల్లుదాం అని మొదలైన రాంగోపాలవర్మ ప్రయాణం, మెగాఫ్యామిలీ ఘాటుగా రెస్పాండ్ అవ్వవలసిన స్థాయికి చేరుకుంది .. ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో ఎవరికి తెలియదు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.