వెనకబడిన “ఖైదీ నెం 150 టీం” అనే కంటే “క్రిష్ టీం” బాగా పని చేస్తున్నారంటే కరెక్టెమో. “క్రిష్ టీం” తెలుగు జాతి, తెలుగు వారు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేస్తున్న ప్రచారం చాలా బాగుంది.
Our BOSS is Back. మెగాఫ్యాన్స్ అందరూ చాలా హ్యపీ. తెలుగు ఇండస్ట్రీ అంతా చాలా హ్యాపీ. తెలుగుసినిమా స్టామినా ఏమిటో, మెగాస్టార్ అంటే ఏమిటో, మరోసారి అందరికీ చూపిస్తున్న సినిమా ఖైదీ నెం 150. తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
శాతకర్ణి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యపీ. తెలుగు ఇండస్ట్రీ అంతా చాలా హ్యాపీ. బాలకృష్ణకు & క్రిష్‌కు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.”క్రిష్ టీం” శాతకర్ణికి వస్తున్న ప్రశంసలను జాగ్రత్తగా గమనిస్తూ, కొందరి కోసం ప్రత్యేక షోస్ నిర్వహిస్తూ, వారి పాజిటివ్ రెస్పాన్స్‌ను, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కోసం బాగా వాడుకుంటుంది. ఈ విషయంలో “ఖైదీ నెం 150 టీం” వెనుకబడి బోతుంది. మా సినిమాకు కలక్షన్స్ వస్తున్నాయనే ధీమాతో ప్రచారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరూ వూహించని రీతిలో కొన్ని చోట్ల బాహుబలిని మించి ఖైదీ నెం 150 కలక్షన్స్ వస్తున్నాయి. మెగాస్టార్ స్టామినాను అంచనా వెయ్యడంలో అల్లు అరవింద్ కూడా ఫెయిల్ అయ్యాడు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ చెయ్యడం లేదు. మరో పక్క శాతకర్ణి టీం మంచి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌తో, తమ సినిమా రేంజ్‌ను కూడా పెంచుకునే దిశగా పనిచేస్తుంది.
bottomline:
క్రిష్ టీం పొస్ట్ రిలీజ్ ప్రమోషన్ అదరగొడుతుంది. ఈ విషయంలో ఖైదీ నెం 150 వెనకబడిపోతుంది. దీని ప్రభావం ఇండియాలో చూపించకపొయినా, అమెరికాలో వీకెండ్ కలక్షన్స్ చాలా డల్ గా వున్నాయి. ఆ టాక్‌తో ఈజీగా ఈ వీకెండ్ 4 మిలియన్స్ చేయవలసిన ఖైదీ నెం 150 సినిమా, కేవలం 2 మిలియన్స్‌తో సరిపెట్టుకుంది.