రాజమౌళి కల నెరవేర్చిన వినాయక్

తెలుగుసినిమా పరిశ్రమ హిరో డామినేషన్ కాబట్టి, రాజమౌళి & వినాయక్ లను తెలుగుసినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఎన్.టి.ఆర్ దే.

ఒకప్పుడు వీరిద్దరూ ఒకరికొకరు నువ్వా నేనా అన్న రీతిలో పొటీ పడే వారు. ఒక సమయంలో వినాయక్, రాజమౌళిని మించిన టాప్ డైరక్టర్‌గా పేరొందాడు. మగధీర తర్వాత మాత్రం వార్ ఒన్‌సైడు అన్నట్టు, రాజమౌళి పూర్తిగా 1 – 10 ఆక్రమించేసాడు. రాజమౌళి తన స్థాయిని బాహుబలితో ఆకాశం అంత పెంచుకుంటే, అఖిల్ సినిమాతో వినాయక్ పాతాళంలోకి పాతుకుపొయాడు. ఇంచుమించు ఒకే స్థాయిలో వున్నవాళ్ళ మధ్య్ ఇంత గ్యాప్ రావడానికి కారణం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు/రిస్క్ అనవచ్చు.

వినాయక్ అసలు రిస్క్ తీసుకోడు.

బాహుబలి సినిమా కోసం రాజమౌళి వెచ్చించిన టైం & రిస్క్ ఎవరూ ఊహించలేరు కూడా. బాహుబలి బెడిసి కొట్టి వుంటే అన్నే ఊహే ఎంతో భయాన్ని కలుగుజేస్తుంది.

ప్రేక్షకుల కోణం నుంచి చూసినప్పుడు, ఈ ఇద్దరి దర్శకుల మధ్య అంత గ్యాప్ వున్నట్టు అనిపించినా, ఒకరి సత్తా మరొకరికి తెలుసు. మంచి స్నేహితులు కూడా. ఒకరినొకరు ఇచ్చుకునే గౌరవంలో ఏ మాత్రం తేడా వచ్చివుండదు.

మగధీర సినిమా బాహుబలిలా ప్లాన్ చేసి తీసింది కాదు, యాక్సిడెంటెల్‌గా వచ్చింది. యాక్సిడెంటెల్‌గా వచ్చినా, తెలుగుసినిమా స్టామినా ఇంతుందా అని అందరినీ ఆశ్చర్యపొయేలా చేసింది.

రాజమౌళి మగధీర తర్వాత వినాయక్ అదుర్స్ వచ్చింది. అదుర్స్ ఆడియో ఫంక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ, అదుర్స్ సినిమా కలక్షన్స్ మగధీర మించి రావాలని ఆశీంచాడు. హిరోల మధ్య పోటిగా కాకుండా, దర్శకుల మధ్య పొటీ అన్నట్టు, తన సినిమాను మించిన సినిమా వినాయక్ తీయాలని ఆశీస్తున్నట్టు చెప్పాడు. ఆ వ్యాఖ్యలు మెగా అభిమానులు & నందమూరి అభిమానులను రెచ్చగొట్టడానికి చేసినట్టుగా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు వినాయక్ దర్శకత్వం వహించిన ఖైదీ నెం 150, కొన్ని చోట్ల రాజమౌళి బాహుబలి సినిమా కలక్షన్స్ బ్రేక్ చేస్తుంది. అప్పటి రాజమౌళి కలను వినాయక్ ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అనుకొవచ్చేమో.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.