చూడనివాళ్ళకు చూడాలనిపించేలా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చాలా బాగా మాట్లాడాడు. బాగుంది. తెలుగుసినిమా ఇండస్ట్రీ బాగు కోరుకునే తెలుగుసినిమా ఇండస్ట్రీ వాడు చేయవలసిన పని ఇది. సినిమాలో వున్న మంచి విషయాలను హైలట్ చేస్తూ మాట్లాడాలి. అలానే మాట్లాడాడు. చాలా బాగుంది.
ఖైదీ నెం 150 విషయానికి వచ్చేటప్పటికి మైండ్‌లో ఎప్పుడో గట్టిగా ఫిక్స్ అయిపొయినట్టు వున్నాడు. “చిరంజీవి స్టామినా 500 కోట్లు. చిరంజీవి ప్రతి సినిమా 500 కోట్లు సాధించాలి” అనేది భ్రమా? వెటకారమా? ప్రేమ? కక్ష? రన్నింగ్‌లో వున్న ఒక సినిమా గురించి “క్లైమాక్స్ ఎందుకు మార్చారు? ఈ క్లైమాక్స్ బాగో లేదు?” అంటూ, “అమ్మడు కుమ్ముడు ..” “రత్తాలు బొత్తాలు ..” అని వెటకారం చెయ్యడం ఎంత వరకు సబబు? చిరంజీవిని పొగుడుతూనే సినిమాను తగ్గించే ప్రయత్నం చెయ్యడం బాదాకరం. ఈయన గౌరవాన్ని ఈయనే తగ్గించుకుంటున్నాడు.
bottomline:
- ఆయన చెప్పేవి నిజాలే కావచ్చు. చిరంజీవిని పర్సనల్‌గా కలిసి చెపితే బాగుండేది.
- తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దవాడు, ఇలా ఒక సినిమాను తగ్గించే పని చెయ్యడం తప్పు.
- చిరంజీవి మీద ప్రేమలా అనిపించడం లేదు. కక్షలా అనిపిస్తుంది. చిరంజీవి మీద కక్ష ఎందుకో, ఆయన భయం లేకుండా ధైర్యంగా చెపితేనే తెలుస్తుంది.
httpv://youtu.be/bfvwLtBNaLY