మీడియా:: స్టార్ కథానాయకులతో సినిమాలెప్పుడు?
విన్నర్ దర్శకుడు: వెంకటేష్‌గారితో చేశాను కదా..? విజయాలే మనపై నమ్మకం కలిగిస్తాయి. వినోదాత్మక కథల్ని, యాక్షన్ నేపథ్యంలో తీయడం నా బలం. ‘విన్నర్’తో పెద్ద హీరోల నుంచి కూడా అవకాశాలు వస్తాయని బలంగా నమ్ముతున్నా.
—-
సాయిధరమ్ తేజ్ తన మొదటిసినిమా “పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతోనే స్టార్ హిరో అయిపొయాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ & సుప్రీమ్ సినిమాలతో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. రేయ్ & తిక్క సినిమాలు పరాజయం పొందినా, వాటి ప్రభావం సాయిధరమ్ తేజ్ పై అంతగా చూపలేదు. మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. విన్నర్ రిలీజ్ సంధర్బంగా పై ప్రశ్న ఏమిటో, దర్శకుడి సమాధానం ఏమిటో !!!! అని మెగా అభిమానులు ఆశ్చర్యపొతున్నారు.
సాయిధరమ్ తేజ్ ను దృష్టిలో పెట్టుకునే చాలామంది కథలు తయారుచేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం అంత ఈజీ కాదు. స్టార్ హిరో గా ట్రీట్ చెయ్యక పొవడం కరెక్ట్ కాదు.
bottomline:
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ బిగ్ స్టార్ కాకపొవచ్చు కాని, స్టార్ హిరోనే. బిగ్ స్టార్ అయ్యే సూచనలు పుష్కలంగా వున్నాయి.