#AA Rocks

kadapafan‏ @nagsforfun1
Arey babu aa suchi fake accts chesukunte chesukunnaru, PK and MB perlu tweets lo vaadi alaa dorikipovatam endukuraa babu

గులకొద్ది టైం వేస్ట్ చేసుకొని హిరో వెంటపడటం, ఆ హిరో సినిమాను తన సొంత సినిమా అనుకొని సోషల్ నెట్‌వర్క్‌లో కాని, నిజ జీవితంలో కాని, పాజిటివ్‌గా మాట్లాడే వాళ్ళు చాలా మంది వుంటారు. అటువంటి ఫ్యాన్స్ చిరంజీవికి, మహేష్‌బాబుకి, బాలకృష్ణకు & పవన్‌కల్యాణ్‌కి ఎక్కువ.

చిరంజీవి అభిమానులందరికీ రామ్‌చరణ్ అంటే గౌరవం. చిరంజీవి అభిమానుల్లో పవన్‌కల్యాణ్‌ను తిట్టేవాళ్ళు వున్నారు, కాని, రామ్‌చరణ్‌ను తిట్టేవాళ్ళు లేరు. పవన్‌కల్యాణ్‌కు కూడా మంచి గౌరవం ఇస్తాడు కాబట్టి, పవన్‌కల్యాణ్ అభిమానులు కూడా రామ్‌చరణ్ ను ఎక్కడా వెటకారం చెయ్యరు.

జూనియర్ ఎన్.టి.ఆర్ కు విచిత్రమైన ఫ్యాన్స్ వున్నారు. కొందరు నందమూరి అభిమానులు తిట్టడం, వాళ్ళు తిడుతున్నారని వేరే అభిమానులు పొగడం జరుగుతూ వుంటుంది.

అల్లు అర్జున్ పరిస్థితి జూనియర్ ఎన్.టి.ఆర్ కంటే విచిత్రం. రామ్‌చరణ్ వచ్చేదాకా బాగా ఓన్ చేసుకున్న మెగాఫ్యాన్స్, రామ్‌చరణ్ వచ్చాక రామ్‌చరణ్ తర్వాతే అల్లు అర్జున్ అయిపొయాడు. అల్లు అర్జున్ ను తక్కువ చేసి మాట్లాడటానికి వెనుకాడటం లేదు.

ఇది గమనించిన అల్లు అర్జున్, ఈ ఫ్యాన్స్ గోల పడలేక ఒక టీంనే ఏర్పాటు చేసేసుకున్నాడు. ఈ టీం ఎంత స్ట్రాంగ్ అంటే, సొషల్ నెట్‌వర్క్‌లో ఈ టీం వ్యుహాలనే, మిగతా హిరోలు ఫాలో అయ్యే రేంజ్‌కు వచ్చేసాడు. ఇంచుమించు ప్రతి హిరో, అల్లు అర్జున్ సృష్టించిన వ్యూహాన్నే ఫాలో అయిపొతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు, ఈ విషయంలో కూడా ట్రెండ్ సెట్టర్ అని అనవచ్చు.

bottomline:
అల్లు అర్జున్ తీరు మెగాఫ్యాన్ కు నచ్చినా నచ్చక పొయినా, #DJ సినిమా టీజర్ కు వస్తున్న స్పందనను అల్లు అర్జున్ టీం జనాల్లోకి తీసుకెళ్తున్న తీరు అందరి హిరోలనీ ఆకట్టుకుంటుంది. రియల్ ఫ్యాన్స్ తో పని లేదు. సొంత టీం వుంది. ఆ టీంకు మెగాఫ్యాన్స్ ను విమర్శించే బ్యాచ్ సపోర్ట్ వుంది. #AA Really Rocks.👌👌👌

బొంగులో మెగాఫ్యాన్స్ మాత్రమే చూస్తే సినిమాలు హిట్ అవ్వవు, అందరూ చూస్తేనే నా సినిమాలు హిట్ అవుతాయనే అల్లు అర్జున్ లాజిక్ డబుల్ రాక్స్.

Note: ఇది, అల్లు అర్జున్ తీరుని క్లోజ్‌గా గమనిస్తున్న మెగాఫ్యాన్స్ టాక్. ఈ కన్నింగ్‌నెస్ చాలా ప్రమాదకరమని కూడా మెగాఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in DJ. Bookmark the permalink.

1 Response to #AA Rocks

  1. Sravan అంటున్నారు:

    ఇంతకూ అల్లు అర్జున్ తీరుపై మీ అభిప్రాయమేమిటో తెలపలేదు.

వ్యాఖ్యలను మూసివేసారు.