సర్దార్ గబ్బర్‌సింగ్ అట్టర్ ఫ్లాప్. ఆ సినిమా రిజల్ట్ ప్రభావం కాటమరాయుడు పై వుందా? అంటే సమాధానం “వుంది” & “లేదు” అని రెండు సమాధానాలు చెప్పవచ్చు. అదెలా అంటే “లేదు” అంటే అబద్ధం అవుద్ది కాబట్టి “వుంది”. “వుంది” అంటే మరో అబద్దం కాబట్టి “లేదు”.
“వుంది” & “లేదు” అనే కన్‌ఫ్యూజన్ & డిస్కషన్ పెట్టి, కాటమరాయుడు ఎలా వుండబోతుందనే దానిపై దృష్టి పెడితే, చూసేసిన సినిమానే మళ్ళీ తీయ్యడం ఏమిటనే విమర్శలు వున్నాయి. చాలా మార్పులు చేసారనే వార్తలతో ఆ విమర్శలు సరిపెట్టుకొవాలి.
సర్దార్ గబ్బర్‌సింగ్ ద్వారా సంపాదించిన అనుభవంతో కాటమరాయుడు సినిమా ప్రిరిలీజ్ పబ్లిసిటీ బాగుంది. అందరూ ఎదురుచూస్తున్నారు. అటు రాజకీయాలు .. ఇటు సినిమాలు .. టైం ఎడ్జెస్ట్‌మెంట్ చెయ్యలేక పవన్‌కల్యాణ్ చాలా ఇబ్బందులు పడుతున్నట్టు జనాలకు క్లియర్‌గా అర్దం అవుతుంది.