పవన్‌కల్యాణ్‌కు ప్రి రిలీజ్ పబ్లిసిటీ అంటే ఇష్టం వుండదు. హైప్ అంటే అసలు ఇష్టం వుండదు. కారణం, తన సినిమాలకు ఆ అవసరం వుండేది కాదు. సినిమా మొదలయినపుడు ఏమీ లేకపొయినా, ఆడియో రిలీజ్ తర్వాత హైప్ బాగా క్రియేట్ అయిపొయేది.
కాలం మారింది, తెలుగుసినిమా రేంజ్ బాగా పెరిగింది. కొత్త రేంజ్‌కు తగ్గట్టు ఓపినింగ్స్ రావాలంటే, సినిమాకు హైప్ చాలా అవసరం. హైప్ క్రియేట్ చేసేది ఫ్యాన్స్ అయినా, హైప్ అంటే ఫ్యాన్స్ భయపడతారు. కారణం, హైప్ కు తగ్గ రేంజ్‌లో సినిమా వుండదెమోనన్న భయం.
కాటమరాయుడు సినిమాను హైప్ చేసిన విధానం చూసి, పవన్‌కల్యాణ్ కూడా ప్రి రిలీజ్ పబ్లిసిటీ అవసరం గుర్తించాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
తెలుగు C/O చిరంజీవి అని చెరిపేసి, తెలుగు C/O రాజమౌళి అని అనుకునే స్థాయిలో పేరు సంపాదించిన, అపజయం తెలియని దర్శకుడు రాజమౌళి, బాహుబలి-2 కి ఎంత హైప్ వస్తే అంత హ్యాపీ అంటున్నాడు. అది కాన్ఫిడెన్స్ అంటే.
ఎవరికైనా(హిరో/దర్శకుడు/నిర్మాత(whoever cares more about the movie)) కష్టపడి సినిమా తీయడమే బాద్యత కాదు. ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ అవసరం. అందుకు తగ్గట్టు ప్రేక్షకులను ప్రిపేర్ చేయవలసిన బాద్యత కూడా వుంది.
Hats off to Rajamouli !!!!
రాజమౌళి, తన సినిమాను హైప్ చేసుకునే ప్రొసెస్ కచ్చితంగా అందరూ గమనించి, ఎంతో నేర్చుకొవాల్సి వుంది. హైప్ చెయ్యడం నేర్చుకునే ముందు, మాస్ పల్స్ క్యాచ్ చెయ్యడం నేర్చుకొవాలి.
httpv://youtu.be/X0G1_W3LC5w