ఏమో ఏమో

కాటమరాయుడు సినిమానాలుగో సాంగ్ కూడా బయటకి వచ్చింది. ఇంతకు ముందు మిర మిర, లాగే లాగే & జివ్వు జివ్వు అంటు మూడు సాంగులు విడుదల చేసారు. ఇప్పుడు నాలుగో సాంగ్ “ఏమో ఏమో” అనే సాంగ్ రిలీజ్ చేసారు. ఆడియో వేడుక లేకుండా ఈనెల 18 న, సరైనోడు సినిమా ద్వారా బన్నీ మొదలెట్టిన “ప్రీ రిలీజ్ ఫంక్షన్” చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 24న ‘కాటమరాయుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

httpv://youtu.be/zggQw2wb60M

ఓ.. ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో
ముళ్ళతీగ మీద మల్లె పూసేసిందేంటో
ఏమో ఏమో ఏంటో
మొత్తం దారి మారిందేంటో
నల్లరాతి గుండెమీద సీతాకోకేంటో
చిరచిరలాడే కంట్లో చక్కెర దారేంటో
చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో
ప్రతిదానికింక కారణంగ నిన్ను చూపుతుంది ఈ లోకం

నీకయ్యిందేంటో నే చేసిందేంటో
ఏమో ఏంటో ……..
నే చెప్పిందేంటో నా తప్పసలేంటో
ఏమో ఏంటో ……….

ఓ.. ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో
ముళ్ళతీగ మీద మల్లె పూసేసిందేంటో

మండేటీ సూర్యుడ్నైనా చల్లార్చే చందామామై
నువ్వొచ్చావా నాకోసం ఈ అదృష్టం ఏంటో
ఘర్జించే మేఘాన్నైనా కరిగించే చల్లాగాలై
నువు కళీశావా ఈ నిమిషం నా అద్రుష్తం ఏంటో

పేలే షభ్దాలెన్నైనా ఏం చెయ్లేదే ఇన్నాల్లూ
ఇవాలి నిశబ్దంలో హాయిగా వచ్చే వణుకేంటో
నాలో ఉండే పడుచుదనం నీలో ఉండే పదునుగుణం
ఒకటైపోతే మనపయనం అటుకో ఇటుకో ఎటుకో ఏంటో

ఓ…ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో నాకే ఏంటో
ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో

ఏమో ఏమో ఏంటో
మొత్తం దారి మారిందేంటో
నల్లరాతి గుండెమీద సీతాకోకేంటో

శత్రువుల గుండెల్లోనా నిద్రిస్తూ ఉండే నాకే
నిను చూస్తే నిద్దుర పాడై ఈ గుండే గుబులేంటో
కత్తుల్లో కదిలే నువ్వే మెత్తంగా మునిగావంటే
చంటోడైనా చెబుతాడే దానర్ధం ఏంటో

అందర్లోనా హుందాగా నిన్నా మొన్నా ఉన్నాగా
ఈపై ఎట్లాగుంటానో ఆపై జరిగే కథలేంటో
అక్కడతోనే గడపకురో కంచే పట్టూ పరికిణితో
నీకై వేచీ నిలిచుంటే అరెరే అరెరే తెలుసా ఏంటో

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కాటమరాయుడు, Featured. Bookmark the permalink.