కాటమరాయుడు ఆడియో – megafans are not happy

దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, కోదండరామిరెడ్డి, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, రాంగోపాలవర్మ, యండమూరి వీరెంద్రనాధ్, కీరవాణి, పూరి జగన్నాధ్ and so on .. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా పెద్ద లిస్ట్ వుంది. వీళ్ళందరూ ఎప్పుడు అవకాశం వస్తుందా, చిరంజీవిని ఇరగ కుమ్మేదాం అని ఎదురు చూస్తూ వుంటారు. కారణం, చిరంజీవి అవసరమైనపుడు వాళ్ళను వాడుకున్నాడనో, చిరంజీవిని మెగాస్టార్ చేసిందని మెమేననే భ్రమలో వుండి, ఇప్పుడు చిరంజీవి వాళ్ళకు ఇవ్వవలసిన ప్రాధాన్యత/గౌరవం ఇవ్వడలేదని వాళ్ళ బాద.

మోహమాటం కోసం చిరంజీవి సినిమా చెయ్యడం చాలా చాలా అరుదు. చేసినా, తెలిసే చేస్తాడు. వెంటనే రియలైజ్ అయ్యి, ట్రాక్‌లోకి వస్తాడు. అందుకనే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో రారాజుగా వుండగలిగాడు. తన కంటే తన సినిమా పెద్దది అని చిరంజీవి ఫీల్ అవుతాడు. తన రేంజ్‌కు తగ్గ వాళ్ళతోనే చెయ్యడానికి ఇష్టపడతాడు. తన స్థానం నిలబెట్టుకొవడానికి, ఒక మెట్టు దిగడానికి & నో అని చెప్పడానికి కూడా వెనుకాడడు. (రీసెంట్‌గా 150వ సినిమా కోసం కథలు చెప్పినోళ్ళంతా తిట్టుకొనేవాళ్ళే. అవకాశం ఇచ్చి, కాదన్న పూరి జగన్నాధ్ సంగతి ఇక చెప్పక్కర్లేదు.)

కాటమరాయుడు ఆడియో – megafans are not happy. అనూప్ రూబెన్స్ ఒక్క పాట “మిర మిర మీసం” మినహా, మిగతా పాటలేవి పవన్‌కల్యాణ్ రేంజ్‌లో ఇవ్వలేదని బాగా ఫీల్ అవుతున్నారు. కేవలం మాటిచ్చాను అని, మోహమాటంతో అనూప్ రూబెన్స్‌కు ఛాన్స్ ఇవ్వడాన్ని, కొందరు సమర్దిస్తున్నా, కొందరు ఆడియో బాగా ఇవ్వలేదని చాలా చాలా బాదపడుతున్నారు. “లాగే లాగే” & “ఏమో ఏమో” .. సాంగ్స్ చాలా బాగున్నా, చిన్న హిరో పాటల్లా వున్నాయని అంటున్నారు.

bottomline:
సినిమా విజయం అంతా మీడియా సపోర్ట్, పవన్‌కల్యాణ్ భుజస్కాందలపై & మెగాఫ్యాన్స్ ఆదరణ మీదే ఆధారపడివుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కాటమరాయుడు, Featured. Bookmark the permalink.