బండ్లగణేష్ పవన్‌కల్యాణ్‌పై చూపించే అభిమానంపై చాలా మందికి అనుమానాలు వున్నాయి. ఎందుకు అంటే ఎవరి కారణాలు వారు చెపుతారు. అభిమానం నిజమా? అబద్ధమా? అనేది పవన్‌కల్యాణ్‌కు అనవసరం. అభిమానం నిజం అయితే మంచిది. అభిమానం అబద్ధం అయితే, పవన్‌కల్యాణ్‌కు వచ్చే నష్టం ఏమి లేదు. (పవన్‌కల్యాణ్ ఏమీ ఆశించడు కాబట్టి)
ఎవో కారణాలు చేత, పవన్‌కల్యాణ్‌కు కొద్దికాలం పాటు దూరమైన బండ్ల గణేష్ మళ్ళీ వచ్చేసాడు. Entertainment is Back.
కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో పవన్ గురించి బండ్ల గణేష్ చెప్పిన మాటలు:
- కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని బళ్లారి రాఘవ అన్నాడు, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- స్వరాజ్యం నా జన్మహక్కు దాన్ని సాధించి తీరుతాను బాల గంగాధర్ తిలక్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- కులం యొక్క పునాదులపై ఒక జాతిని కాని, ఒక నీతిని కాని నిర్మించలేం అన్నాడు భారతరత్న డా.బాబాసాహేమ్ అంబేద్కర్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్లన్నాడు సర్‌సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- చిరిగిన చొక్కా తొడుక్కోండి కాని ఒక మంచి పుస్తకం కొనుక్కొండి అన్నాడు కందుకూరి విరేశలింగం, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు, నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యం పతనదినం అన్నాడు మహాత్మా గాంధీ, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్ర్యాన్ని తెచ్చిస్తాను అన్నాడు సుభాష్ చంద్రబోస్, ఆయనలాంటివాడని చెప్పమంటారా..
- ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్‌సింగ్ మళ్లీపుట్టాడని చెప్పమంటారా
—బండ్లగణేష్