ఆన్లైన్ – ఇది చాలా డేంజర్ గురు. సెలబ్రిటీకి ట్వీటర్ ఎకౌంట్. ఫేస్బుక్ ఎకౌంట్ వుంటే ఇంకా డేంజర్. అల్లు వారి కుళ్ళు వ్యూహాల వలన, మెగా ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. మెగాఫ్యాన్స్ అంటే C/O చారిటీ అనుకునే రేంజ్ నుంచి, మెగాఫ్యాన్స్ అంటే C/O చిల్లర గొడవలు అనే రేంజ్‌కు ఈ అల్లు ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చేసారు.
చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు, మెగాఫ్యాన్స్ పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరవడం, చిరంజీవి రాజకీయాల్లో ఘోర వైఫల్యం తర్వాత చిరంజీవికి చాలా ఇబ్బందిగా వున్న మాట వాస్తవం. ఇక్కడ తప్పు పట్టవలసింది ఫ్యాన్స్‌ను కాదు. ఇలా అరవడం అనేది ఎప్పుటి నుండో వుంది. చిరంజీవి అంతలా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అన్నయ్య ఒక్క మాట తమ్ముడు గురించి మాట్లాడేస్తే, అంతటితో ఆ అరుపులు ఆగిపొతాయి.
ఈ చిరంజీవి వీక్నెస్ పట్టుకొని, అల్లు వారు ఆడిన డ్రామా, మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టింది. బహుశా, అల్లు వారు లేకపొతే మెగాఫ్యామిలికి ఇంత సీను లేదు అనే పొగరుతో, మధ్యలో దూరినట్టు వున్నారు. మెగా హిరోలెవరూ, అల్లు వారిని డైరక్ట్‌గా ఖండించకపొయినా, మెగాఫ్యాన్స్ మాత్రం వూరుకొవడం లేదు.
అటు అల్లు వారితో, ఇటు బాబాయితోనూ బ్లడ్ రిలేషన్ కలిగిన ఏకైన మెగా హిరో రామ్‌చరణ్. అందరూ కావాలనుకునే రామ్‌చరణ్, పాపం బ్యాలెన్స్ చేయలేక నలిగిపోతున్నాడు. అటు అమ్మ ఫ్యామిలీ, ఇటు నాన్న ఫ్యామిలీ.
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కాటమరాయుడు’. కిశోర్‌కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న కాటమరాయుడును ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శనివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించిన సందర్భంగా కాటమరాయుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. స్పందించకపొతే ఫ్యాన్స్‌తో గొడవ అవుద్దెమోనని భయంతో, ఈ ట్రైలర్‌పై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్(చెర్రీ) ఫేస్బుక్ వేదికగా స్పందించవలసి వచ్చింది. ‘పవర్‌ప్యాక్డ్ సెలబ్రేషన్‌లా ఉంది మన అందరి కాటమరాయుడు’అంటూ పోస్ట్ చేశారు.