`కాటమరాయుడు` తమిళ “వీరం” సినిమాకు రీమేక్. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, తెలుగులో వీరుడొక్కడే అని డబ్ చేసి టి.వి లో అనేకసార్లు ప్రదర్శించారు. ఇంచుమించు అందరూ చూసేసారు. కథ అందరికీ తెలుసు. అహా ఒహో అనే కథ కాకపొయినా, పర్వాలేదు. గబ్బర్‌సింగ్ లా పెద్ద హిట్ అవుద్దెమో అనే ఆశ వున్నా, అన్నవరం రేంజ్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయిపొయారు. అన్నవరం రేంజ్ అనుకొవడానికి కారణాలు 1) ఆడియో(మిరా మిరా మీసం సాంగ్ ఒకటి సరిపొలేదు) 2) దర్శకుడు మంచి మార్పులు చేసినా, నెక్స్ట్ రేంజ్‌కు తీసుకెళ్ళే భారీ హైలట్స్ లేవు.
ఫైనల్ టాక్ కాటమరాయుడు హిట్:
1) ఫ్యాన్స్ హ్యాపీ
2) మాస్ ఫుల్ హ్యాపీ
3) మిగతా వాళ్ళు పర్వాలేదు
కాటమరాయుడి కష్టాలు:
తెలుగుదేశం మిడియా హెల్ప్ చేస్తున్నా, వైయస్సార్సిపి మిడియా డౌన్ చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. 50+ frustrated RGV, మరింత frustrationకు గురయ్యి, మరింత క్రియేటివితో frustrated ట్వీట్స్ చేస్తున్నాడు. ఈవిధంగా కాటమరాయుడిని కష్టాలు కలుగుజేయడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
సన్మానం కోసమే రాంగోపాలవర్మ frustrated ట్వీట్స్:
మోహన్‌బాబు & దాసరి నారాయణ రావులు, చిరంజీవిని ఇండైరక్ట్‌గా అనని మాటలు లేవు. దానికి కారణం సింపుల్. చిరంజీవి వాళ్ళకు ఇవ్వవలసిన ప్రాధాన్యత/గౌరవం ఇవ్వడం లేదనే బాద. చిరంజీవి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యే దాకా వాళ్ళు ఆపలేదు. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి.
రాంగోపాలవర్మ బాద కూడా అదే అనుకుంట. మెగా బ్రదర్స్ నుంచి సన్మానం కోసమే “50+ రాంగోపాలవర్మ” frustrated ట్వీట్స్ చేస్తున్నాడని, రాంగోపాలవర్మను ఫాలో అవుతున్న ఒక మేధావి వర్గం ఊహిస్తుంది.
మెగాఫ్యాన్స్ పై లేనిపొని అభాండాలు:
మెగా ఫంక్షన్స్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచేది పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి ఫ్యాన్స్ వేరు .. పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ వేరు .. అని సరదాగా మెగాఫ్యాన్స్ తమలో తాము జోక్స్ వేసుకుంటారు. ఇప్పుడు ఆ జోక్స్ సోషల్ మిడియాలో కనిపించడంతో, ఆ జోక్స్ నిజం అని మన వైయస్సార్సిపి మిడియా ప్రచారం చెయ్యడం మొదలెట్టింది. మెగాఫ్యాన్స్ పై లేనిపొని అభాండాలు వేస్తున్నారు.
bottomline:
కాటమరాయుడు మాస్ హిట్. మెగాఫ్యాన్స్ కు నచ్చింది.