I am more honest than PK -RGV

Ram Gopal Varma‏Verified account @RGVzoomin
A 50+ ith arried aughter atching orn is ore owerfully onest than elivering a owerless ilm n elebrating irthdays of two aughters ith two ives

నేను, ఎవరినైనా, ఎన్నెన్ని, వెటకారపు మాటలైనా, నోటికొచ్చింది అంటాను. నన్ను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు. ఇది రాంగోపాలవర్మ ట్వీటర్ బాగోతం. వ్యక్తిగతంగా చాలామందిని, చాలామంది నమ్మకాలను వెటకారం చేస్తాడు. ఆయన తీరు తెలిసినోళ్ళు సెలబ్రెటీస్ ఎవరూ, భయంతోనో, భక్తితోనో పట్టించుకోరు.

మెగాఫ్యామిలీని వివిధ రకాలుగా టార్గెట్ చేస్తే, మెగాఫ్యామిలీ పట్టించుకొలేదు కాని, ఆవేశపరులైన కొందరు మెగాఫ్యాన్స్ రాంగోపాలవర్మ శవయాత్ర చేసారు. పాపం దానికి బాగా హర్ట్ అయ్యాడు. ఒక పక్క పట్టించుకోను అంటూనే, చాలా సందర్భాల్లో తనదైన రీతిలో చాలా తెలివిగా రెస్పాండ్ అవుతూ వుంటాడు.

మెగాఫ్యామిలీ తనను పట్టించుకోట్లేదు అని డోస్ పెంచాడు. చిరంజీవి 150 సినిమాని 151 చేసే ప్రయత్నం చేసాడు. ఈయన దాడి తట్టుకొలేక టైటిల్లోనే 150 అని పెట్టుకొవల్సిన పరిస్థితి క్రియేట్ చేసాడు. తట్టుకొలేక, నాగబాబు ఘాటుగా స్పందించాడు. నాగబాబుకు మద్దతుగా చిరంజీవి కూడా గట్టి పెట్టాడు.

టెంపరరీగా చిరంజీవిని పక్కన పెట్టి, పవన్‌కల్యాణ్‌పై దృష్టి పెట్టాడు. మీడియా, పవన్ ను మీ స్పందన ఏమిటంటే, పవన్‌కల్యాణ్ చాలా గట్టిగా గిల్లాడు. యాభై ఏళ్ళు దాటి, కూతురికి పెళ్ళి చేసి, పోర్న్ గురించి బహిరంగంగా మాట్లాడే వాళ్ళ గురుంచి నేనేమి స్పందించను అని మిడియానే తిరిగి ప్రశ్నించాడు. రాంగోపాలవర్మకు, అప్పుడు ఎలా స్పందించాలో తెలియలేదు. ఇప్పుడు మొదలెట్టాడు.

బయ్యర్లకు నష్టం కలిగించే విధంగా పవర్‌లెస్ సినిమాలు తీసి, కూతుళ్ళతో బర్త్‌డేలు జరుపుకునే పవన్‌కల్యాణ్ కంటే, యాభై ఏళ్ళు పైబడి కూతురికి పెళ్ళి చేసిన నేను బహిరంగంగా పొర్న్ సినిమాలు చూస్తానని చెప్పుకొవడంలో, నేను పవన్ కల్యాణ్ కంటే నిజాయితీ పరుడిని అని అంటున్నాడు.

bottomline:
నేనొక్కడినే తెలివైన వాడిని, మిగతా మనుషులంతా వెధవలు అని ఫీల్ అయ్యే రాంగోపాలవర్మను, అదే లోకంలో వదిలేయకుండా, అనవసరంగా పవన్ కల్యాణ్ మరీ గట్టిగా గిల్లినట్టు వున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కాటమరాయుడు. Bookmark the permalink.