రాజశేఖర్ బాటలో రాంగోపాలవర్మ

చిరంజీవి “ఠాగుర్” సినిమా తమిళ్ సినిమా “రమణ” సినిమాకు రీమేక్. ఆ సినిమా హిరో రాజశేఖర్ చేద్దామని అనుకున్నాడు. చిరంజీవి తన పలుకబడి ఉపయోగించి, రాజశేఖర్ నుంచి తను లాగేసుకున్నాడని రాజశేఖర్ కు కోపం వచ్చింది. దానికి ప్రతీకారంగా, అదే పనిగా చిరంజీవి మీదే 24 X 7 చిరంజీవి పతనం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే, నష్టం ఎవరికి?

చిరంజీవి ఏమి చేసాడో, ఎలా చేసాడో దాని ప్రభావం తెలిసేది, ఒక్క రాజశేఖర్ కే. చిరంజీవి కోణంలో ఆలోచిస్తే, పలుకబడి ఉపయోగించుకొని తనకు వచ్చేలా చేసుకొవడం తప్పు కాదు. దానికి బదులుగా తనను బద్ద శత్రువుగా చేసుకొవాల్సిన అవసరం లేదు. బహిరంగంగా అవసరం లేకపొయినా టి.వి లు పట్టుకు తిరిగి చిరంజీవిని ఒక విలన్ చేయవలసిన అవసరం లేదు. చిరంజీవి విలన్ కాదని యావత్ ప్రజానీకానికి తెలుసు.

ఇప్పుడు రాంగోపాలవర్మ రాజశేఖర్ బాటలో, 24 X 7 చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఎందుకు పయనిస్తున్నాడనేది, మీడియాలో ఎవరికి అర్దం కావడం లేదు. “మీడియాలో తన ఉనికి చాటుకొవడానికే” అని అనుకుంటే మాత్రం పొరబాటు. రాంగోపాలవర్మ ఒకరి కోసం బ్రతకడు. ఒకరి గుర్తింపు కోసం అసలు బ్రతకడు. మెగాఫ్యామిలీని ఇంతలా ద్వేషించడానికి కారణలు ఏమిటనేది, తనంతట తను చెపితే కాని తెలియదు.

చిరంజీవితో సినిమా మొదలుపెట్టి, మధ్యలో వదిలేసి వెళ్ళిపొయాడు. చిరంజీవికి క్షమాపణలు కూడా చెప్పాడు. చిరంజీవి రాంగోపాలవర్మను విమర్శించ వలసిన అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవితో ఎటువంటి సంబంధాలు లేవు.

పవన్‌కల్యాణ్ మాత్రం రాంగోపాలవర్మ చెప్పిన ఒక కథను రిజెక్ట్ చేసాడు. ఒక కథను రిజెక్ట్ చేసినందుకే ఇంత పగ బట్టాడంటే కూడా నమ్మకాశ్యంగా లేదు.

నాకు దమ్ము ఎక్కువ .. నేను పెద్ద తోపు .. అనుకునే రాంగోపాలవర్మ .. అసలెందుకు చిరంజీవి ఫ్యామిలీని ఇంతలా నెగిటివ్‌గా టార్గెట్ చేస్తున్నాడన్నది, రాజశేఖర్ బాటలో రాంగోపాలవర్మ కూడా ఓపెన్‌గా భయం లేకుండా చెపితే కాని తెలియదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Mega Family. Bookmark the permalink.