మొదటిసినిమా చిరుత తో తానేమిటన్నది ప్రేక్షకులకు పరిచయం చేసుకొని, తన రెండో సినిమా మగధీర తోనే ఇండస్ట్రీ హిట్ సాధించి, ఆ తర్వాత ఏమిటి అని దిగులు పడకుండా, ఒకే అపజయం ఆరెంజ్ తో దెబ్బతిని, మరు వెంటనే రచ్చ, నాయక్ & ఎవడు మూడు కమర్షియల్ విజయాలు సాధించి, మెగాస్టార్ వారసుడిగా మెగా అభిమానుల మనసుల్లో మెగాస్టార్ కు తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
ఆరెంజ్ అపజయంతో ఎక్సపెరమెంట్స్ చెయ్యడానికి భయపడిన రామ్‌చరణ్, ధృవ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ప్రస్తుతం రామ్‌చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ విభిన్న కథలో నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రంలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. March 27th, రామ్‌చరణ్ బర్త్‌డే. Happy Birthday to MegaPowerStar Ram Charan.