శ్రీనువైట్ల పాటలు మేకింగ్ లో కేక

  1. వరుణ్‌తేజ్ మొదటిసినిమా ముకుందపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు.
  2. రెండో సినిమా కంచె రిలీజ్ టైమింగ్ తో పాటు, ప్రిరిలీజ్ హైప్ తీసుకురావడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. లక్కీగా మంచి పేరు వచ్చింది. క్లాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు.
  3. మూడో సినిమా లోఫర్, పూరి జగన్నాధ్ సినిమాగా రిలీజ్ అయ్యింది. ఇది కూడా ఫెయిలే. యాక్టర్‌గా ఓపెన్ అయ్యి బాగా చేసాడు. ఏ రోల్ అయినా చేయగలడు అనిపించేలా, కథా రచయితలకు & దర్శకులకు బాగా కనెక్ట్ అయ్యాడు.

మొదటి మూడు సినిమాల ద్వారా వరుణ్ తేజ్ కు ప్రేక్షకుల్లో ఏ రకమైన ఇమేజ్ రాలేదు.

ఇప్పుడు నాలుగో సినిమా మిస్టర్. ఎంటర్‌టైన్‌మైంట్ C/O శ్రీనువైట్ల దర్శకుడు. వరుణ్ తేజ్ కమర్షియల్ రేంజ్ అమాంతంగా పెంచుతాడు అని మెగాఫ్యాన్స్ ఆశీస్తున్నారు. ఆగడు .. బ్రూస్‌లీ .. బాటలో వెళితే, మరో లోఫర్ సినిమా మాదిరి ఎవరూ ఏమీ చెయ్యలేరు.

శ్రీనువైట్ల ఎంటర్‌టైన్‌మైంట్ పండించడంలోనే కాదు, పాటలు మేకింగ్ లో కూడా కేక. బాద్‌షా, ఆగడు & బ్రూస్‌లీ పాటలు విజువల్స్ చాలా బాగుంటాయి. “ఇరవై కోట్ల హిరోనే .. నేను ఫార్మ్‌లో లేను” అని మిస్టర్ సినిమాకు కూడా పాటల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించడం లేదు.

ఎంత నిజమో తెలియదు కాని, హిరో & దర్శకుల రెమ్యునరేషన్ .. సినిమా బిజినెస్ అయిన తర్వాతే తీసుకునే డీల్ సెట్ చేసుకున్నారని ఫిలిం నగర్ టాక్. అందుకే ఈ సినిమా విజువల్స్ అంత రిచ్‌గా వున్నాయెమో.

httpv://youtu.be/Uoln6Z-4djs

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in మిస్టర్, Featured. Bookmark the permalink.