చిరంజీవిని మెగాస్టార్ చెయ్యడంలో అల్లు అరవింద్ ముఖ్య పాత్ర వహించడం మాత్రమే కాదు, మెగా ప్రొడ్యుసర్ గా అంతే సక్సస్ అయ్యాడు. టాలీవుడ్ శాసిస్తున్న, ఆ నలుగురిలో ఒకడు. అల్లు అరవింద్ తో పోల్చుకుంటే, చిరంజీవి తమ్ముడిగా నాగబాబు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. వరుణ్ తేజ్ ను పెద్ద హిరోగా ఇంట్రడ్యూస్ చేయలేకపొయాడు, కాని వరుణ్ తేజ్‌కు మంచి అవకాశాలు వచ్చాయి.నాగబాబు గైడన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా వరుణ్ తేజ్ మూడు సినిమాలు “ముకుంద” “కంచె” “లోఫర్” ఫినిష్ చేసాడు. ఈ సినిమాలు ఎంతమందికి నచ్చాయి, ఎంత కలెక్ట్ చేసాయనే విషయాలు పక్కన పెడితే, వరుణ్‌తేజ్ నటుడిగా నిలబడటానికి చాలా ఉపయోగబడ్డాయని చెప్పవచ్చు. క్లాస్ & మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలి ఆడియన్స్ కూడా వరుణ్ తేజ్ నచ్చేలా చేసాయి.
వరుణ్ తేజ్ కమర్షియల్ రేంజ్ ఇంకా చిన్న హిరో స్థాయిలోనే వుంది. శ్రీనువైట్ల ఏ రేంజ్‌కు తీసుకెళ్తాడో అని మెగా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.
“నీ మీద మనసాయరా” రిమిక్స్, మంచి సరప్రైజ్. విజువల్స్ లో వరుణ్ తేజ్, యంగ్ అమితాబచ్చన్ ను గుర్తుకు తెచ్చాడని అంటున్నారు. వరుణ్ తేజ్ చాలా చాలా హుందాగా వున్నాడు.
httpv://youtu.be/w8LJVmRFew0