పవన్‌కల్యాణ్ అవసరం కోసం ఎవరు పిలిచినా వస్తాడు. పవన్‌కల్యాణ్ కు అవసరం కనిపించాలి. వరుణ్ తేజ్ విషయంలో పవన్‌కల్యాణ్ కు అవసరం కనిపించినట్టు లేదు.
ఇప్పటి వరకు వచ్చిన వరుణ్ తేజ్ నాలుగు సినిమాలకు సంబంధించిన విషయంలో ప్రమోషన్‌కు, పవన్‌కల్యాణ్ అసలు ఉపయోగపడలేదు, వరుణ్ తేజ్ గురించి చిన్న విషయం కూడా పవన్‌కల్యాణ్ మాట్లాడలేదు.
కంచె సినిమా పవన్‌కల్యాణ్ కు కచ్చితంగా నచ్చే సినిమా. వరుణ్ తేజ్, ఆ సినిమాను బాబాయ్ కు చూపించి, ఆ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటాడని మెగాఫ్యాన్స్ ఆశీంచారు కాని, అదెందుకో అలా జరుగలేదు.
వరుణ్ తేజ్ గురించి పవన్‌కల్యాణ్ ఏమి చెపుతాడో అని మెగాఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ బాకీని పవన్‌కల్యాణ్ ఎప్పుడు తీరుస్తాడో !!!
++++++++++++++++++++++++++++++++++++
“అభిమానులే దేవుళ్ళు .. అభిమానులు లేకపొతే మేము లేము” అంటే వాళ్ళను అవమానించడం కాదు.
ఒకప్పుడు చిరంజీవి పేరు వినబడితే ఏ సభలో నైనా వైబ్రేషన్స్ వచ్చేవి. ఇప్పుడు పవన్‌కల్యాణ్ పేరు చెపితే అటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు కోరుకున్నట్టుగా రెండు మంచి మాటలు పవన్ కల్యాణ్ గురుంచి చెప్పేస్తే, వాళ్ళు చల్లబడిపొతారు.
ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ చూసి వేరే అభిమానులు ఈర్ష్య పొందేవారు. ఇప్పుడు మెగాభిమానుల్లో వర్గాలు సృష్టించి, ఒక వర్గం పవన్‌కల్యాణ్ క్రేజ్ చూసి ఈర్ష్య పొందేలా చేసిన అల్లు ఫ్యామిలీ, ఏమి లబ్ధి పొందిందో తెలియదు, కాని, మెగాభిమానుల్లోఒక వర్గం అల్లు అర్జున్ ను ద్వేషించేలా చేసింది.
Nice of Varun Tej: మెగా ఫ్యామిలీ అంటే ప్రాణాలివ్వడానికైనా వెనుకాడని పిచ్చి వాళ్ళు ఆశించే మాటలు మాట్లాడి వాళ్ళని ఆనందపరిచినందుకు, థాంక్స్.
httpv://youtu.be/T3fQE9fqimI