‘మిస్టర్’ -> వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీనువైట్ల దర్శకుడు.
ప్రస్తుతం అందరూ బాహుబలి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కంటే రెండు వారాల ముందు వరుణ్ తేజ్ ‘మిస్టర్’ ప్లాన్ చేసారు. ఈ నిర్ణయం కరెక్టా కాదా అనేది ఎవరికీ తెలియదు.
సినిమా నిలబడాలంటే మంచి టాక్ తెచ్చుకొవాలి. మంచి టాక్ తెచ్చుకున్నా, రెండు వారాల తర్వాత, కంటీన్యూ అవ్వడానికి థియేటర్స్ వుంటాయా? .. థియేటర్స్ లో వున్నా, జనాలు చూడటానికి వస్తారా అనేది డౌటే. బాహుబలికి అంత హైప్ వుంది. బాహుబలి తర్వాత రిలీజ్‌కి ఇంకా ఎక్కువ పొటీ వుంది.
వరుణ్ తేజ్ కమర్షియల్ రేంజ్ ఎంతో తెలియజెప్పే సినిమా కాబట్టి, నిర్ణయం కరెక్ట్ కాదెమో అని అనుమానాలు వున్నా, మంచి టాక్ తెచ్చుకుంటే, నిర్ణయం కరెక్ట్ అయ్యే ఛాన్స్ వుంది.