ఇప్పుడు ఇండియా నెం 1 డైరక్టర్ అంటే, అతి అనిపించవచ్చెమో కాని, బాహుబలి2 సక్సస్ తర్వాత, అందరూ రాజమౌలీ ఇండియా నెం 1 కమర్షియల్ డైరక్టర్ అని ఒప్పుకొవాల్సిందే. మగధీరతో రాజమౌళి అంటే విజన్ అని అనిపించుకున్నాడు, బాహుబలి-1 తర్వాత తెలుగు అంటే రాజమౌళి అయ్యాడు.
Telugu C/O Rajamouli
బాహుబలికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందంటే తప్పు … గుర్తింపు వచ్చేలా బాహుబలి టీం పని చేసారు, వారి పని ఫలించిందంటే కరెక్ట్.
ప్రతి ఒక్కరికి ఎదో తెలియని గట్ ఫీలింగ్ వుంటుంది. కోటి మందిలో ఒక్కరే దానిని సాధించగలరు. మగధీర సినిమా అప్పుడే రాజమౌళికి దేశవ్యాప్తంగా తన సినిమా రిలీజ్ చెయ్యాలని ఆశ వున్నా, అల్లు అరవింద్ నమ్మకపొవడంతో అది సాధ్యం కాలేదు.
రాజమౌళిని బాహుబలి నిర్మాతలు నమ్మారు. రాజమౌళి ఏదైతే విజన్ చేసాడో, అది సాధించాడు.
రెండు రకాల విమర్శలు వుంటాయి. వీడు మనోడు కాదని చేసే విమర్శలు ఒక రకం అయితే, నిజంగా చేసే విమర్శలు కొన్ని. అలానే వీడు మనోడు అని చేసే పొగడ్తలు కొన్ని అయితే, నిజంగా చేసే పొగడ్తలు. విమర్శలు/పొగడ్తలు నిజమైనవా, వెటకారమైనవా అని ఈజీగా కనిపెట్టేయవచ్చు. మెజారిటీ తెలుగువాళ్ళు ఓన్ చేసుకున్నారు. కొందరు నిజమైన విమర్శలు చేసారు. అందరూ నా వాళ్ళే అంటున్నాడు రాజమౌలీ.
rajamouli ssVerified account @ssrajamouli
3M hearts….
You loved me, praised me, supported me, criticised me, helped me, enlightened me, treated me as your family. Thank you.
😙 for those who like
🙏 for those who dislike
Please be who you are..
Ill be who I am..